నిజామాబాదు జిల్లాలో పెట్రోల్ , డీజిల్ కొరత లేదు ఎలాంటి వదంతులను నమ్మవద్దు పోలీస్ కమీషనర్ వెల్లడి జిల్లాలో పెట్రోల్ , డీజిల్ కొరత లేదని నిజామాబాదు పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య, ఐ.పి.ఎస్. స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న వదంతుల కారణంగా ప్రజలు ఆందోళనకు గురవుతూ , ఒకేసారి పెద్ద సంఖ్యలో పెట్రోల్ బంకులకు వెళ్లి వాహనాల్లో ఫుల్ ట్యాంక్ నింపించుకోవడం వల్ల అనవసర రద్దీ, అంతరాయం ఏర్పడుతున్నదని తెలిపారు. జిల్లాలోని అన్ని పెట్రోల్ బంకుల్లో సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని , సరఫరా కూడా నిరంతరంగా కొనసాగుతున్నదని పేర్కొన్నారు. ఎటువంటి కొరత పరిస్థితి లేదని, ప్రజలు అవసరానికి మించి ఇంధనం నిల్వ చేసుకోవద్దని సూచించారు. అలా చేయడం వల్ల ఇతరులకు అసౌకర్యం కలుగుతుందని తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలను నమ్మకూడదని, నిర్ధారించని సమాచారాన్ని షేర్ చేయడం ద్వారా గందరగోళం సృష్టించవద్దని పోలీస్ కమీషనర్ విజ్ఞప్తి చేశారు.జిల్లాలో శాంతిభద్రతలు కాపాడేందుకు పోలీసులు అప్రమత్తంగా ఉన్నారని , వదంతులు వ్యాప్తి చేయడం లేదా ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే చర్యలు చేపడితే , సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
జిల్లాలో పెట్రోల్ , డీజిల్ కొరత లేదు ఎలాంటి వదంతులను నమ్మవద్దు :
0
18
Previous article


