*బాధ్యతల బరువు– నిర్లక్ష్యపు*
*నీడలా ప్రయాణం*
* అధికారులు ఎన్నో విధాలుగా కట్టుదిట్టం చేసినప్పటికీ మారని వైనం!!
నిజామాబాద్ . మార్చి 24 . (జన సంఘర్షణ )
రాష్ట్ర ప్రభుత్వం ప్రయాణికుల శ్రేయస్సు సురక్షిత ప్రయాణం కొరకు తీసుకుంటున్న పర్యవేక్షణలో భాగంగా నిజామాబాద్ నగర (జిల్లా) ట్రాఫిక్ ఏసిపి గా మస్తాన్ అలీ బాధ్యతలు చేపట్టిన నాటినుండి నగర ట్రాఫిక్ సిఐ పబ్బ ప్రసాద్ , ఆధ్వర్యంలో నిరంతరం నిర్లక్ష్య ప్రయాణంపై డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడం, త్రాగి బండి నడపడం, హెల్మెట్ లేని ప్రయాణం మొదలగు చర్యలపై జరిమానా వీలైతే జైలుకు పంపిస్తూ ట్రాఫిక్ పోలీసులు అహర్నిశాల కృషి చేస్తున్నారు . ఇదిలా ఉండగా నిజామాబాద్ నగరం మాలపల్లి ప్రాంతంలో ఒక స్కూటీ పైన ఆరుగురు విద్యార్థులు మధ్యాహ్నం వేళ ప్రమాదకరంగా ప్రయాణిస్తూ కనిపించినారు. తల్లిదండ్రులకు ఎన్నిసార్లు కౌన్సిలింగ్ ఇచ్చిన తమ పిల్లలు ఇంటికి రావడమే ప్రథమ ద్యేయంగా ప్రయాణిస్తున్న విధానాన్ని మరిచి నిర్లక్ష్యానికి తావిస్తున్నారు. ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే వాళ్లతోపాటు తోటి ప్రయాణికుల ప్రాణాలకి ముప్పు ఉంటుంది. ఈ విషయం పైన సంబంధిత ట్రాఫిక్ పోలీసులు మరింత కఠినమైన తగు చర్యలు తీసుకోగలరని నగర వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు..


