Homeతెలంగాణనిజామాబాద్త్వరలోనే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు

త్వరలోనే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు

📰 Generate e-Paper Clip

 

జిల్లా కలెక్టర్, అధికారుల తో ప్రత్యేక సమావేశమై…

జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉంటాం

పత్రికారంగం చాలా ప్రత్యేకం…

ప్రజాస్వామ్య వ్యవస్థలో పాత్రికేయుల పాత్ర కీలకం

టిపిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్

ప్రెస్ క్లబ్ కమిటీ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం మహోత్సవం..

జర్నలిస్టుల చిరకాల వాంఛ అయిన ఇళ్ల స్థలాల విషయమై జిల్లా కలెక్టర్ అధికారులతో ప్రత్యేక సమావేశమై త్వరలోనే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని టిపిసిసి అధ్యక్షులు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పాత్రికేయుల పాత్ర అత్యంత కీలకమని అన్నారు.పత్రికా రంగానికి ఎంతో ప్రత్యేక ప్రాధాన్యత ఉందని అన్నారు. ప్రజా సమ స్యలను ప్రభు త్వానికి రాజకీయ నాయకుల దృష్టికి తీసుకెళ్లే వారధి మీడియా నేనని బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉంటామని అన్నారు. జర్నలిస్టులకు ఎల్లప్పుడూ అండగా ఉం టానని జర్నలిస్టుల సమ స్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. సోమ వారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బస్వా గార్డెన్ లో ప్రెస్ క్లబ్ నూత న కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం అంగ రంగ వైభవంగా జరుపుకున్నా రు. ఈ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహో త్సవ కార్యక్రమానికి ఎమ్మెల్సీ టీపీసీసీ అధ్యక్షులు బోమ్మ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహా దారులు మొహమ్మద్ షబ్బీర్ అలీ , రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి ,అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్య నారాయణ, తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహే ర్ బిన్ హుందా న్,నగర మేయర్ కూరగాయల ఉమారాణి, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్పాగంగారెడ్డి, వేలే నెస్ ఆస్పత్రి ఎండీ అసద్ ఖాన్, వెల్నెస్ ఆసుపత్రి మెడికల్ డైరెక్టర్ వెంకట్ రెడ్డి రాజకీ య నాయకులు ప్రముఖులు ము ఖ్య అతి థులుగా హాజ రయ్యారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ కమిటీ నూతన కార్యవర్గం ముఖ్య అతిథు లను శాలువాతో ఘనంగా సన్మానించారు.

 

 

_టిపిసిసి అధ్యక్షుల చేతుల మీదుగా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం.._

 

ప్రెస్ క్లబ్ కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి, కోశా ధికారి, ఉపాధ్యక్షులు, సం యుక్త కార్యదర్శులు, కార్య నిర్వాణ కార్యదర్శి, కార్య వర్గ సభ్యులను టిపిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ చేతుల మీదుగా ప్రమాణ స్వీకారం చేయిం చారు. ప్రెస్ క్లబ్ అభివృ ద్ధికి జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఈ సందర్భంగా నూతన కార్యవర్గానికి టీపీసీసీ అధ్యక్షులు సూచించారు

 

_నూతన కార్యవర్గానికి సన్మానం_

 

ఎన్నికల్లో నూతనంగా ఎన్నికైన ప్రెస్ క్లబ్ నూతన కమిటీ నూతన కార్యవ ర్గాన్ని ముఖ్య అతిథులు శాలువాతో ఘనంగా సన్మానించారు.అనంతరం ప్రెస్ క్లబ్ పూర్వ అధ్యక్షులను ముఖ్య అతిథులు శాలువాతో ఘనంగా సన్మానించారు.

 

_జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చి.. ఇండ్లు నిర్మించి ఇవ్వాలి_

ఎన్నో సంవత్సరా ల నుంచి ఎదురు చూస్తున్న జర్న లిస్టుల చిరకాల వాంఛ అయిన జర్నలి స్టుల ఇళ్ల స్థలాలు డబుల్ బెడ్ రూమ్ ,ఇళ్ల స్థలాల విషయమై ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఆధ్వర్యం లో జర్నలిస్టులు ముఖ్య అతిథులకు ఈ సందర్భం గా వినతి పత్రం అందజేశా రు.

 

_జర్నలిస్టులకు ఎల్లప్పుడూ అండగా ఉంటా.._

 

_పత్రికా రంగం చాలా ప్రత్యేకం_

 

_టిపిసిసి అధ్యక్షు లు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్_

 

జర్నలిస్టులో లేనిది రాజకీయ నాయకులు లేరనే సూక్తి నేను నమ్ము తానని టిపిసిసి అధ్యక్షు లు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. నా రాజ కీయ మార్గంలో ఎందరో జర్నలిస్టులు నాకు ఎంతో సహకారం అందిం చారని ఈ సందర్భంగా తెలిపారు. భారత రాజ్యాంగ ప్రకారం జర్నలిస్టులు ఫోర్త్ పిల్లర్ అని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పాత్రికేయుల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. సమాజంలో జరుగుతున్న విషయాలను ప్రజలకు నిజాయితీగా తెలియజేసే బాధ్యత మీడియాపై ఉందని, ప్రజల సమస్యలను పాలకులకు చేరవేయడంలో జర్నలిస్టులు కీలక వంతు పోషిస్తున్నారని అన్నారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్ కొత్త కమిటీ జర్నలిస్టుల సంక్షేమం కోసం మరింత కృషి చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

టిపిసిసి నాయకుడిగా కాదు జర్న లిస్టులకు సోదరిడిగా నేను ఉంటానని అన్నారు. జర్నలిస్టుల కష్టాల్లో పాలు పంచుకుంటానని అన్నా రు. ప్రతిరోజు వివిధ పేప ర్లు చదివితేనే ఎంతో తృప్తిగా ఉంటుందన్నారు. రాష్ట్రంలోనే జర్నలి స్టుల ను ఆదుకోవాల్సిన అవస రం ఎంతైనా ఉందన్నా రూ. జర్నలిస్టుల వృత్తి ఎంతో గొప్పది అన్నారు. రాజకీయాలు కొంతవరకు కలుషితమైతుందినే మాట వాస్తవమే. రాజకీ యాల్లో మంచి చేసే వారిని ప్రోత్సహించండనీ తెలి పారు. జర్నలిస్టుల సమ స్యల పరిష్కారానికి నేను ఎల్లప్పుడూ అండగా ఉంటానని బొమ్మ మహేష్ అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మాట్లాడుతూ… జర్నలిస్ట్ లు ఎదుర్కొంటున్న ఇళ్ల స్థలాల సమస్య హోసింగ్ సొసైటీ ద్వారా నామినల్ ప్రైస్తో ఇచ్చేందుకు కృషి చేస్తామన్నారు.అతి త్వరలోనే వారి సమస్యను పరిష్కరిస్తామన్నారు. టీపీసీసీ చీఫ్, స్థానిక ఎమ్మెల్యేలు సూర్యనారాయణ, భూపతిరెడ్డి మేమందరం కలిసి దశ దిశా నిర్దేశం చేసి సమస్య పరిష్కరిస్తామన్నారు.

 

రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి మాట్లాడుతూ… జరలిస్టులు ఎదుర్కొంటున్న ఇళ్ల స్థలాల సమస్య కొత్తదేమి కాదని రూరల్ నియోజకవర్గంలో స్థలం చూసి ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల అప్పాజెప్పే బాధ్యత తీసుకుంటామన్నారు.కాంగ్రెస్ పార్టీ జర్నలిస్టులకు అండగా ఉంటుందన్నారు.

 

అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ.. మీడియా ప్రజల సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే వారధి అని వారి సమస్యలు పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేయాలని కోరారు.జర్నలిస్ట్ ల న్యాయమైన సమస్య ఇళ్ల స్థలాల గత టిఆర్ఎస్ హయాంలో మాట తప్పారని నేడు కాంగ్రెస్ ప్రభుత్వం వారికి వెంటనే ఇల్లాస్థలాలు ఇవ్వాలని కోరారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు. వెల్ నెస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు హెల్త్ కార్డులు ఇవ్వడం పట్ల ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా నిజామాబాద్ నగర మేయర్ కూరగాయల ఉమారాణి మాట్లాడుతూ.. నూతనంగా ఎన్నికైన ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

 

జర్నలిస్టులకు వెల్నెస్ ఆసుపత్రి ఉచిత ఐడి కార్డ్ ల ఆవిష్కరణ…….

 

వెన్నెల ఆస్పత్రిలో జర్నలిస్టులకు ఉచితంగా వైద్యం అందించేలా రూపొందించిన వెళ్లే ఆసుపత్రి ఐడి కార్డు లకు సంబంధించి వెల్నెస్ ఆసుపత్రి కార్యక్రమాన్ని ముఖ్య అతిథుల చేతుల మీదుగా ఆవిష్కరించారు.

జర్నలిస్టులకు అండగా మేముంటామని వెల్నెస్ ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్ అసద్ ఖాన్, మెడికల్ డైరెక్టర్ డాక్టర్ వెంకటరెడ్డి తెలిపారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్ జనరేషన్ పూర్తి గా ఉచిత వైద్యం అంది స్తామని ఈ సందర్భంగా తెలిపారు. జర్నలిస్టుకే కాకుండా వారి కుటుం బానికి కూడా పూర్తిగా ఉచిత వైద్యం వెల్నెస్ ఆసుపత్రి నుండి అందిస్తాం.

 

 

_ ఎన్నికైన ప్రెస్ క్లబ్ నూతన కమిటీ నూతన కార్యవర్గ సభ్యులు వీరే.._

 

అధ్యక్షులు పంచరెడ్డి శ్రీకాంత్,ప్రధాన కార్యదర్శి డా॥ వాగ్మారే సుభాష్, కోశాధికారి రాజ్ కుమార్, ఆర్గనైజింగ్ సెక్ర టరీ బి.రాజు, ఉపాధ్యక్షులు బైసా సంగీత,సతీష్ గౌడ్, గోవిందరాజు, సంయుక్త కార్యదర్శి రవీందర్ నాయ క్,ఆంజనేయులు, కార్యవర్గ సభ్యులు సితారే కృష్ణ, పబ్బ భూమేష్, ఆడెపు నరేంద్ర స్వామి, జి.భాస్కర్ గౌడ్, సందీప్ దేశ్ ముఖ్, కొట్టురు సుదర్శన్, రవి చరణ్ రెడ్డి, తాళ్ళ శ్రీధర్, ప్రీతం రెడ్డి, ఆడెపు శ్రీనివాస్, సి ఎస్ జయపాల్, కొక్కు రవి

ఈ కార్యక్రమంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి రాంభూ పాల్ ,కాంగ్రెస్ పార్టీ జిల్లా ,నగర అధ్య క్షులు. బొబ్బిలి రామకృష్ణ డి సి సి ప్రసిడెంట్ నగేష్ రెడ్డి, నుండ చైర్మెన్ కేశవేను కాంగ్రెస్ నాయకులు రత్నాకర్, కాటిపల్లి నరేందర్ రెడ్డి, ఖూద్దూస్,బాల్ రామ్ రాంభూపాల్ వివిధ పార్టీల నాయకులు, జర్నలిస్టులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular