మితిమీరి లంచలతో కుమ్మకై అవినీతి అధికారులు అక్రమ సంపాదన. పంజా విసిరిన ఏసీబీ.. తహసీల్దార్ శ్రవణ్ ఇంట్లో సోదాలు అవినీతిలో రెండవ స్థానంలో ఉన్న రెవెన్యూ శాఖ లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా వాణిజ్య శాఖ, ఆర్టీవో శాఖ, రెవెన్యూ శాఖ, విద్యుత్ శాఖ, రిజిస్టర్ కార్యాలయం, పౌర సరఫరాల శాఖ, వ్యవసాయ శాఖ, విద్యాశాఖ అవినీతిలో ముందు వరుసలో ఉన్నాయి. ఈ శాఖలలో పనిచేసే కొంతమంది అధికారులు అవినీతికి చోటు కల్పిస్తూ భారీ ఎత్తున ఆస్తులు పెంచుకుంటున్నారు. ఆదాయంకి మించి ఆస్తులు కూడా పెట్టుకుంటూ చివరికి ఏసీబీకి చిక్కుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు పనుల నిమిత్తం వచ్చే బాధితుల కన్నీళ్లు అధికారులకు ఏసీబీ రూపంలో కనిపిస్తున్నాయి. పాపం చేసినవాడు ఏ రోజైనా ఒకరోజు పాపం కడుక్కోవలసిన పరిస్థితి ఉంటుందని ఏసీబీ దాడుల వల్ల తెలుస్తుంది. తాజాగా కరీంనగర్ లోని గజ్వేల్ తహసీల్దార్ కమటం శ్రవణ్ ఇండ్లలో ఏసీబీ సోదాలు నిర్వహిస్తున్నారు.నగరంలోని మహారాజా బార్ అండ్ రెస్టారెంట్ వెనుక ఉన్న ఇంటితో పాటు ఆర్టీసీ కాలనీలో రెండు చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.దీంతో పాటు శ్రవణ్ కుమార్ తండ్రి ఇంటి వద్ద లక్ష్మీనగర్ లోని సోదరి ఇంట్లో సైతం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.భారీగా నగదు, బంగారం సీజ్ చేసినట్లు సమాచారం.. సోదాకు వచ్చే ముందు సమాచారం అందుకొన్న తహసీల్దారు శ్రావణ్ హిందూపూర్ కాలనీలోని తన ఇంటినుండి ఒక బ్యాగును కిందకు విసిరేసినట్లు తెలుస్తుంది. బ్యాగులో భారీగా నగదు పట్టుబడినట్లు సమాచారం


