Homeఆర్టికల్స్రసాయన శాస్త్ర విభాగానికి చెందిన అమల కు డాక్టరేట్ ప్రధానం 

రసాయన శాస్త్ర విభాగానికి చెందిన అమల కు డాక్టరేట్ ప్రధానం 

📰 Generate e-Paper Clip

 

తెలంగాణ యూనివర్సిటీ రసాయన శాస్త్ర విభాగానికి చెందిన అమల కు డాక్టరేట్ ప్రధానం

తెలంగాణ యూనివర్సిటీ రసాయన శాస్త్ర విభాగానికి చెందిన రిసెర్చ్ స్కాలర్ కుమారి అమల, “డిజైన్ మరియు సింతేసిస్ అఫ్ నైట్రోజెన్ అండ్ సల్ఫేర్ బేస్డ్ హేతేరోసైకిల్స్ ఎస్ పోతేంటిల్ ఏంటిమైక్రోబియల్ ఏజెంట్స్ ” అనే అంశంపై చేసిన తన పరిశోధన కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసి, సిద్ధాంత గ్రంథాన్ని అధికారికంగా సమర్పించింది. ఈ పరిశోధన ప్రయాణం మొత్తం Dr. A. నాగరాజు వారి పరివేక్షణలో కొనసాగింది.

అమల తన పరిశోధనలో భాగంగా నైట్రోజన్ మరియు సల్ఫర్ ఆధారిత హెటెరోసైకిల్స్‌ను సంశ్లేషణ చేసి, అవి యాంటిమైక్రోబియల్ ఏజెంట్లుగా ఉపయోగపడే అవకాశాలను విశ్లేషించింది. ప్రపంచవ్యాప్తంగా యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ సవాలు పెరుగుతున్న సందర్భంలో కొత్త ఔషధాల అవసరం పెరుగుతోంది. ఈ పరిణామం నేపథ్యంలో అమల చేసిన అధ్యయనం శాస్త్రీయంగా ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. సిద్ధాంత గ్రంథ సమర్పణ అనంతరం నిర్వహించిన వైవా–వోస్ పరీక్షలో ఓస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ రాంచందర్ గారు ఎక్స్‌టర్నల్ ఎగ్జామినర్‌గా వ్యవహరించారు. అమల ని అడిగిన వివిధ శాస్త్రీయ, సాంకేతిక ప్రశ్నలకు ఆమె లోతైన అవగాహనతో, పరిశోధన ఆధారితంగా సమాధానాలు ఇవ్వడం ప్రశంసనీయమైందని ఎగ్జామినర్ పేర్కొన్నారు. ఆమె పరిశోధన నైపుణ్యం, ఆత్మవిశ్వాసం, ప్రయోగపద్ధతులపై ఉన్న పట్టు ప్రత్యేకంగా శ్లాఘనీయమని అభిప్రాయపడ్డారు.కార్యక్రమానికి డీన్, ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్ ప్రొఫెసర్ సంపత్ కుమార్ గారు, రసాయన శాస్త్ర విభాగాధిపతి Dr. సాయిలు  అలాగే బోర్డ్ ఆఫ్ స్టడీస్ (BOS) సభ్యులు — నాగరాజు, బాలకిషన్, గంగాకిషన్, నాగేశ్వరరావు, రాజేశ్వరి, డేనియల్, సురేష్, అపర్ణ, నాగేంద్ర బాబు, రఘువీర్, గంగాధర్ — హాజరై అమల సాధనను అభినందించారు. కార్యక్రమంలో పలువురు రిసెర్చ్ స్కాలర్స్ మరియు విద్యార్థులు కూడా పాల్గొని వాతావరణాన్ని మరింత శాస్త్రీయంగా, ఉత్సాహభరితంగా మార్చారు. విభాగం తరఫున అందరూ అమల భవిష్యత్తులో మరిన్ని ఉన్నత స్థాయి పరిశోధనలు చేసి, సంస్థ ప్రతిష్ఠను మరింత ఎత్తుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular