ఆర్డీవో కార్యాలయంలో రాజకీయ నాయకులతో సమావేశం
బోధన్, మే 20
బోధన్ ఆర్డీవో ఎం. విజయ కుమారి బుధవారం బోధన్ పట్టణంలోని అన్ని రాజకీయ పార్టీ ల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసారు.ఈ సందర్భంగా, రాజకీయ ప్రతినిధులకు, ఆర్డీవో ఎం .విజయ కుమారి బోధన్ పట్టణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ తాలూకు మ్యాపింగ్ ప్రక్రియ ను వేగవంతం చేసే క్రమం లో తమ సహకారం కోరారు. బిఎల్ఓ ల కు సంబంధిత వోటర్ జాబితా లో ని వ్యక్తులను చేరుకునే క్రమం లో ఎదురవుతున్న సమస్యలకు అవసరమైన పరిష్కారాలను సూచించి, ప్రజా ప్రతినిధులు కౌన్సిలర్ లు , రాజకీయ పార్టీ ల ప్రతినిధులు ఈ సందర్భంగా తమ తో సహకరించాలి ఆమె పేర్కొన్నారు.ఈ కార్యక్రమం లో బోధన్ ఆర్డీవో కార్యాలయంలో పరిపాలన అధికారి పీ. వెంకటేష్ బోధన్ కన్స్టిట్యూన్సీ ఎలక్షన్ సెల్ సిబ్బంది ఎన్. సుశీల , అహమదుద్దీన్, ముస్తఫా, తదితరులు పాల్గొన్నారు. ఇందుమూలంగా, ఆర్డీవో ప్రభుత్వం ద్వారా విడుదల అయిన బి ఎల్ ఓసూచిక షెడ్యూల్ ను పార్టీ ల ప్రతినిధులకు వివరించి, తమ సహకారం కీలకం అని వ్యాఖ్యానించారు. ఎట్టి పరిస్థితుల్లో అయినా, మాపింగ్ ప్రక్రియను త్వరలోనే పూర్తి చేసి తీరే విధంగా కృషిచేయాలి అని అధికారులను ఆదేశించారు.


