Homeతెలంగాణనిజామాబాద్బోధన్ లో బక్రీద్ పండుగ నేపథ్యంలో ముస్లిం మత పెద్దలతో పోలీస్ కమిషనర్ సమావేశం

బోధన్ లో బక్రీద్ పండుగ నేపథ్యంలో ముస్లిం మత పెద్దలతో పోలీస్ కమిషనర్ సమావేశం

📰 Generate e-Paper Clip

బోధన్ లో బక్రీద్ పండుగ నేపథ్యంలో ముస్లిం మత పెద్దలతో పోలీస్ కమిషనర్ సమావేశం

బోధన్: మే 07జన సంఘర్షణ

బక్రీద్ పండుగను శాంతియుతంగా మరియు సామరస్య వాతావరణంలో నిర్వహించేందుకు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐ.పి.ఎస్. ఆధ్వర్యంలో ముస్లిం మత పెద్దలు , మసీదు కమిటీ సభ్యులతో సమన్వయ సమావేశం బోధన్ పట్టణంలోని గురువారం సాయంత్రం లయన్స్ క్లబ్ హల్ యందు నిర్వహించారు.

ఈ సమావేశంలో పండుగ సందర్భంగా తీసుకోవాల్సిన భద్రతా చర్యలు, ప్రజల సహకారం, మరియు శాంతి భద్రతల పరిరక్షణపై చర్చ జరిగింది.

ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ బక్రీద్ వంటి ముఖ్యమైన పండుగలను పరస్పర గౌరవంతో జరుపుకోవడం సమాజంలో ఐక్యతకు ప్రతీక అని పేర్కొన్నారు. పండుగ రోజుల్లో ఎలాంటి అపోహలు, వదంతులు వ్యాప్తి చెందకుండా అప్రమత్తంగా ఉండాలని , ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా వచ్చే అసత్య ప్రచారాలను నమ్మవద్దని ప్రజలకు సూచించారు. అనుమానాస్పద సమాచారం గమనించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా అధికారులకు తెలియజేయాలని కోరారు.

ప్రార్థనా స్థలాల వద్ద ప్రత్యేక పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ముఖ్య ప్రాంతాల్లో సీసీ కెమెరాల ద్వారా నిరంతర నిఘా కొనసాగించడంతో పాటు, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపడతామని చెప్పారు. పండుగ రోజుల్లో ప్రజలు ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు పోలీస్ శాఖ చర్యలను అభినందిస్తూ, శాంతి భద్రతలను కాపాడేందుకు తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకునేలా ప్రజలకు అవగాహన కల్పిస్తామని హామీ ఇచ్చారు.

సమావేశంలో ఇతర పోలీస్ అధికారులు కూడా పాల్గొని తమ తమ సూచనలు వెల్లడించారు. జిల్లాలో శాంతి, సామరస్య వాతావరణం కొనసాగేందుకు పోలీస్ శాఖ మరియు ప్రజలు పరస్పర సహకారంతో ముందుకు సాగాలని కమిషనర్ పిలుపునిచ్చారు.

ఈ సందర్బంగా పాటించ వలసిన వారికి నిబంధనలను వివరించి , వారి నుండి సలహాలు కూడా స్వీకరించారు.

ఈ సందర్బంగా అదనపు డి. సి. పి ( అడ్మిన్ ) శుభం ప్రకాష్ , బోధన్ ఎ. సి. పి శ్రీనివాస్ , ట్రాఫిక్ ఏ.సి.పి శ్రీ మస్తాన్ అలీ , స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ రెడ్డి , బోధన్ ఎస్. హెచ్. ఓ వెంకట నారాయణ, బోధన్ రూరల్ సి.ఐ విజయ్ బాబు , రుద్రూర్ సి.ఐ శ్రీ కృష్ణ , బోధన్ మనోజ్ , హబీబ్, బోధన్ రూరల్ ఎస్.ఐ మచ్చేందేర్ రెడ్డి , ఎడపల్లి ఎస్. ఐ రమ , వర్ని ఎస్.ఐ వంశీ కృష్ణ రెడ్డి , రెంజల్ ఎస్.ఐ చంద్ర మోహన్ , ట్రాఫిక్ ఎస్.ఐ మహేష్ , కోటగిరి ఎస్. ఐ సునీల్ , మున్సిపల్ వైస్ చెర్మన్ ఇలియాస్ , కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు పాషా గారు మరియు ముస్లిం మత పెద్దలు ఖురేషిలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular