సాలూరా మండలంలోని మంజీరా తగ్గేల్లి ప్రాంతంలో ప్రభుత్వం అనుమతులతో ఇసుక తవ్వకాలు జరుగుతున్నప్పటికీ, కొందరు క్రింది స్థాయి రెవెన్యూ సిబ్బంది డోజర్ నిర్వాహకులతో కుమ్మక్కై సహకరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
నియమాల ప్రకారం యంత్రాలతో ఇసుక తవ్వకాలు నిషేధంలో ఉన్నప్పటికీ, వాటిని పట్టించుకోకుండా డోజర్ల సహాయంతో భారీ స్థాయిలో ఇసుకను లోడ్ చేస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ చర్యల వల్ల ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించబడటమే కాకుండా, సహజ వనరులకు కూడా నష్టం కలుగుతోందని వారు అంటున్నారు.
ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, డోజర్ నిర్వాహకులకు సహకరిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న క్రింది స్థాయి రెవెన్యూ అధికారుల పాత్రపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఇసుక తవ్వకాలలో నిబంధనలు ఖచ్చితంగా అమలు అయ్యేలా పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేయాలని కోరుతున్నారు.


