Homeహైదరాబాద్కూకట్పల్లిపేద,మద్యతరగతి సొంతింటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం: బండి రమేష్ 

పేద,మద్యతరగతి సొంతింటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం: బండి రమేష్ 

📰 Generate e-Paper Clip

హైదరాబాద్ సిటీ, మేడ్చల్ మల్కాజ్గిరి ప్రతినిధి అంజిబాబు నాగుల, ఆగస్టు 12, (జన సంఘర్షణ):

కూకట్పల్లి నియోజకవర్గం 9వ ఫేజ్ గోకుల్ ప్లాట్స్ వద్ద కట్టబోయే ఇందిరమ్మ టవర్ ల శంకుస్థాపనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానుండటంతో కార్యక్రమ ఏర్పాట్లను శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ గారితో కలసి టిపిసిసి ఉపాధ్యక్షులు,కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి రమేష్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ ఇంత విలువైన భూమిని నామమాత్రపు ధరతో పేదలకు,మద్యతరగతి వారికి ఇల్లుకట్టి అందించటానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. హైదరాబాద్ పరిధిలో లక్ష ఇందిరమ్మ ఇల్లు కట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని.మొత్తం 16 అసెంబ్లీ నియోజకవర్గాలలో 807 కోట్ల అంచనాలతో పరిపాలన అనుమతులు మంజూరు చేసిందని చెప్పారు.ఒక్కో ప్లాటుకు ప్రభుత్వం 5 లక్షల సబ్సిడీ అందిస్తుందని,లబ్ధిదారుని వాటా 6 లక్షలు చెల్లించాలని, కుటుంబ వార్షిక ఆదాయం 6 లక్షలు మించని వారు దరఖాస్తు చేసువాలని, నిబంధనలు, విధి విధానాలు తెల్సుకొని మీ- సేవాకేంద్రాలు, 8096958096 వాట్సాప్ సర్వీసుల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ ఆగష్టు 15 అని, ఈలోగా అర్హత కలిగిన ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమం మొదట మన నియోజకవర్గంతోనే శ్రీకారం చుట్టినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి బండి రమేష్ కృతఙ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పుష్ప రెడ్డి, తూము వేణు, దినేష్ కుమార్, సాయిబాబు చౌదరి, రంగమోహన్, వినోద్, శంకర్ ,రాజేష్, కిల్లరి శ్రీనివాస్, చావా శ్రీనివాస్,గోపాల్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular