Homeతెలంగాణహైదరాబాద్ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలి: బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు పిలుపు

ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలి: బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు పిలుపు

📰 Generate e-Paper Clip

భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు.. చార్మినార్ వేదికగా ఘనంగా ‘తిరంగా యాత్ర’

♦ రాజకీయాలకు అతీతంగా ‘తిరంగా యాత్ర’.. పాల్గొన్న విద్యార్థులు, ప్రజలు

♦ ఆగస్టు 14న ట్యాంక్ బండ్ పై భారీ తిరంగా యాత్ర: ఎన్. రామచంద్రరావు ప్రకటన

♦ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ప్రగతి పథంలో ‘వికసిత్ భారత్’ సాధన

భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు పాతబస్తీలోని ప్రసిద్ధ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆలయ నిర్వాహకులు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు కి ఘనంగా స్వాగతం పలికి, శాలువాతో సత్కరించి అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు.

దర్శనం ముగిసిన వెంటనే బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు ఆధ్వర్యంలో చార్మినార్ వేదికగా భారీ ‘తిరంగా యాత్ర’ ర్యాలీ ప్రారంభమైంది.

స్వాతంత్య్రం వచ్చి 79 సంవత్సరాలు పూర్తవుతున్న ఈ శుభసమయంలో దేశభక్తిని చాటుకునేలా ప్రతీ ఒక్కరూ తమ తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేయాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

ఈ తిరంగా యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం నుంచి సాగిన ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున విద్యార్థులు, స్థానిక ప్రజలు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు.

అంతేకాకుండా, రాబోయే 14వ తేదీన ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం నుంచి వివేకానంద విగ్రహం వరకు అత్యంత వైభవంగా మరో భారీ తిరంగా యాత్రను నిర్వహించనున్నట్లు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు తెలిపారు.

ఈ మహా క్రతువులో ప్రజలందరూ భాగస్వాములు కావాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు కోరారు. ఇది ఏ ఒక్క పార్టీకో పరిమితమైనది కాదని, రాజకీయాలకు అతీతంగా సాగుతున్న కార్యక్రమం కాబట్టి ప్రతి ఒక్కరూ తరలిరావాలని విజ్ఞప్తి చేశారు.

దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన అమరవీరులకు ఈ సందర్భంగా నివాళులర్పించారు. వారి త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని, వారి మార్గంలో పయనించాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు పేర్కొన్నారు.

గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఈ ‘తిరంగా యాత్ర’ అత్యంత ఉత్సాహంగా జరుగుతోందని నాయకులు గుర్తుచేశారు. దేశాన్ని సర్వతోముఖాభివృద్ధి వైపు నడిపిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ కంటున్న ‘వికసిత్ భారత్’ (అభివృద్ధి చెందిన భారత్) కల నిజం కావాలంటే ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. ప్రధాని ఆకాంక్షించిన బలమైన, సమర్థవంతమైన భారతదేశాన్ని సాకారం చేసేందుకు అందరూ కలసికట్టుగా కృషి చేయాలని కోరారు.

దేశ సమగ్రత, ఐక్యతను చాటిచెప్పేలా సాగుతున్న ఈ యాత్రను విజయవంతం చేసి, మన జాతీయ జెండా గౌరవాన్ని నిలబెట్టాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular