- * 2014 నుంచి కొనసాగుతున్న గణేష్ ఉత్సవాలు.. ఐకమత్యంతో పాల్గొన్న గ్రామస్థులు
సాలుర మండలం / సెప్టెంబర్ 18 ( జన సంఘర్షణ )
నిజామాబాద్ జిల్లా సాలూర మండలంలోని తగ్గేల్లి
గ్రామంలో శ్రీరామ గణేష్ మండలి ఆధ్వర్యంలో శుక్రవారం అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. 2014 సంవత్సరం నుంచి శ్రీరామ గణేష్ మండలి ఆధ్వర్యంలో గణనాథుడిని ప్రతిష్ఠించి ప్రతి ఏటా భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉత్సవాలను కొనసాగిస్తున్నట్లు మండలి సభ్యులు తెలిపారు.గణేష్ ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులు, గ్రామస్థులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. గ్రామంలోని చిన్నా పెద్దా, మహిళలు, యువకులు, భక్తులు పెద్ద సంఖ్యలో ఒకతాటిపైకి వచ్చి కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తిశ్రద్ధలతో అన్నదాన ప్రసాదాన్ని స్వీకరించి గణనాథుడి ఆశీస్సులు పొందారు.
ప్రతి సంవత్సరం గణేష్ ఉత్సవాలను కలిసికట్టుగా నిర్వహించడం ద్వారా గ్రామంలో ఐకమత్యం, సోదరభావం మరింత పెరుగుతోందని గ్రామస్థులు తెలిపారు. గణనాథుడి పూజలు, అన్నదాన కార్యక్రమంతో .తగ్గేల్లి గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. భక్తులు, గ్రామస్థుల సహకారంతో ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్న శ్రీరామ గణేష్ మండలి సభ్యులను గ్రామస్థులు అభినందించారు. ఈ కార్యక్రమంలోశ్రీరామ గణేష్ మండలి కమిటీ సభ్యులు కార్తీక్ చంద్రకాంత్ ఎంపీటీసీ దేవరావ్ రాజు సదానంద్ రీనేష్ బజరంగ్ వీరేష్ గంగాధర్ ప్రభాకర్ జ్ఞానేశ్వర్ ఓంకార్ శ్రీధర వెంకట్ మహేష్, నిఖిల్,


