హైదరాబాద్ సిటీ ప్రతినిధి నాగుల అంజిబాబు, అక్టోబర్ 02 (జన సంఘర్షణ):
ఆడది అర్ధరాత్రే కాద
అందరున్నా… అభద్రత పరిస్థితులే
గుడి, బడి ,ఒడి
కొలిచే స్థలమైనా.. మలిచే స్థలమైనా..
హింస పరమ దుర్మార్గమై పట్టమేల్తున్న వేళ
గాంధీ ..
నీ కలలు నెరవేరేదెలా….??
హింసొక వికృత క్రీడై
పట్టపగలు పబ్లిక్గా తలలుతెగిపడే
తెగింపుల నిత్య దుర్ధినాలు
విలువలుడిగిన విద్యామూర్తులు
వొలువలిడిచే శిష్యమూకలు
పాము ముంగీసల పైశాచికతలకు
పట్టుదప్పిన విద్యారంగం
మద్యం, మాదకద్రవ్యాలూ
క్యాడరు రక్షణాస్త్రాలై
మత్తుగమ్మిన కార్పోరేట్ రాజకీయం గాడి తప్పిన పాలన
సాంకేతిక సైబర్ సొరుగులో దూరిన ఏఐ కేతువు
మాయాజాలపు ఉచ్చులో
పేట్రేగే మాఫియా…
మానవతకు చోటుండని
మృగాల వనాలవిస్తరింపులకు
అడ్డుకట్టలకు
ఆహ్వానిద్దాం సత్యనిరతిని
అవాహిద్దాం అనితర శాంతిని.
-కొండూరి కోటిబాబు
హైకోర్టు అడ్వకేట్, సురవరం ప్రతాపరెడ్డి విశ్వవిద్యాలయం, హైదరాబాద్.


