తెలంగాణ భవన్‌లో సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌కు స్వాగతం పలికిన యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివ చరణ్ రెడ్డి
నిజామాబాద్ ఉమ్మడి జిల్లా బ్యూరో న్యూఢిల్లీ / అక్టోబర్ 12 / (జన సంఘర్షణ):
భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఇండియా కూటమి ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొనేందుకు న్యూఢిల్లీకి చేరుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌లకు తెలంగాణ భవన్‌లో యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివ చరణ్ రెడ్డి స్వాగతం పలికారు.
అనంతరం నిర్వహించిన భారీ ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌తో పాటు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
*ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో….!!!* ఇండియా కూటమి నిర్వహించిన ఈ ర్యాలీలో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు, యువజన కాంగ్రెస్ శ్రేణులు పాల్గొని తమ సంఘీభావాన్ని తెలిపారు.


