*ధాన్యం కొనుగోళ్లలో సిండికేట్‌పై చర్యలు తీసుకోవాలి!!!!*
*రైతులను ఇబ్బంది పెడితే సహించేది లేదు.. దళారులపై చర్యలు తప్పవన్న పోచారం!!*
నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల బ్యూరో/, అక్టోబర్ 7:/(జన సంఘర్షణ) వర్ని రైతులు పండించిన ధాన్యానికి ఇతర రాష్ట్రాల వ్యాపారులు క్వింటాల్‌కు రూ.4,000 వరకు ధర చెల్లిస్తుండగా, వర్ని మండలంలోని కొంతమంది వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి సుమారు రూ.500 తక్కువకు కొనుగోలు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంపై శాఖాపరంగా విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని *బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, నిజామాబాద్ సీపీ సాయి చైతన్యకు ఫిర్యాదు చేశారు…!!!!*
*ఈ సందర్భంగా పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ..!!!!!* ఆరుగాలం కష్టపడి పంట పండించే రైతులను ఇబ్బందులకు గురిచేసే దళారులను ఉపేక్షించేది లేదన్నారు. ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడే వారిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. సిండికేట్‌గా వ్యవహరిస్తున్న వారి వివరాలు, పేర్లను తనకు అందిస్తే వాటిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకునేలా చూస్తానని తెలిపారు.
*రైతులు, కార్యకర్తలు ధాన్యం!!!!!* కొనుగోళ్లలో దళారుల వల్ల ఇబ్బందులు ఎదురైతే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని పోచారం సూచించారు. రాబోయే రోజుల్లో ధాన్యం ధరల పరిస్థితి ఎలా ఉంటుందో స్పష్టమవుతుందని, రైతులకు న్యాయమైన ధర లభించేలా అధికారులు మార్కెట్ పరిస్థితులను పర్యవేక్షించాలని కోరారు. రైతుల ప్రయోజనాలకు విఘాతం కలిగించే చర్యలకు అడ్డుకట్ట వేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు నాయకులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.


