Homeతెలంగాణపెద్దాయపల్లిలో విషాదం.. పదేళ్ల బాలిక మృతి

పెద్దాయపల్లిలో విషాదం.. పదేళ్ల బాలిక మృతి

📰 Generate e-Paper Clip

గుండెపోటుతో చిన్నారి మృతి.. కన్నీరుమున్నీరుగా విలపించిన తల్లిదండ్రులు*

నిజామాబాద్ ఉమ్మడి జిల్లా బ్యూరో / అక్టోబర్ 12 / (జన సంఘర్షణ):

రాజంపేట మండలం పెద్దాయపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గొల్ల మహాన్విత (10) ఆదివారం రాత్రి గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

నాలుగో తరగతి చదువుతున్న మహాన్విత అకాల మరణంతో తల్లిదండ్రులు పవన్ కుమార్, లక్ష్మితో పాటు కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. చిన్నారి మృతితో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

పదేళ్ల వయసులోనే బాలిక మృతి చెందడంతో పెద్దాయపల్లి గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular