Homeఎడిటోరియల్రెండు నెలల్లో వివాహం.. పుట్టినరోజునే జవాన్ వీరమరణం

రెండు నెలల్లో వివాహం.. పుట్టినరోజునే జవాన్ వీరమరణం

📰 Generate e-Paper Clip

 

 

*నాగాలాండ్‌లో జరిగిన కాల్పుల్లో రాయగడకు చెందిన అసోం రైఫిల్స్ జవాన్ వి. తేజ మృతి!!!!*

రాయగడ, /అక్టోబర్ 7:/(జన సంఘర్షణ) నాగాలాండ్‌లో జరిగిన కాల్పుల్లో రాయగడకు చెందిన అసోం రైఫిల్స్ జవాన్ వి. తేజ (30) బుధవారం వీరమరణం పొందారు. తన పుట్టినరోజునే తేజ మృతి చెందడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

మరోవైపు తేజకు నెల రోజుల క్రితమే నిశ్చితార్థం జరిగింది. డిసెంబర్ 10న వివాహం జరగాల్సి ఉండగా, పెళ్లి ఏర్పాట్లలో ఉన్న కుటుంబానికి ఈ విషాద వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. దీపావళి పండుగకు ఇంటికి వచ్చేందుకు సిద్ధమవుతున్న సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

తేజ భౌతికకాయం హైదరాబాద్ నుంచి విశాఖపట్నం మీదుగా రాయగడకు చేరుకోనుంది. వివాహానికి రెండు నెలల ముందు జవాన్ వీరమరణం పొందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular