Homeతెలంగాణకామారెడ్డిఇసుక ట్రాక్టర్ల క్యూ లైన్ చూస్తే జాతర 

ఇసుక ట్రాక్టర్ల క్యూ లైన్ చూస్తే జాతర 

📰 Generate e-Paper Clip

ఇసుక ట్రాక్టర్ల క్యూ లైన్ చూస్తే జాతర

అధికారుల నిర్లక్ష్యమే అక్రమ ఇసుక రవాణా

కాదు ఇందిరమ్మ ఇళ్ల పేరిట తరలిపోతున్న ఇసుక !

కామారెడ్డి జిల్లాలో ఆఫ్లైన్లోనే ఇసుక అనుమతులు !

భారీగా రెవెన్యూ శాఖకు, పోలీస్ శాఖకు, ఆర్టీవో శాఖకు ముడుపుల చెల్లింపులు !

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ముఖ్యంగా కామారెడ్డి జిల్లా బాన్సువాడ, జుక్కల్, బోధన్ నియోజకవర్గ ఇసుక మాఫియా మంజీరా నది, గోదావరి నది బంగారు బాతగా గుడ్డుగా మారింది. ఇప్పటికే ఈ రెండు నదుల నుంచి కోట్లాది రూపాయల విలువ చేస్తే పకృతి సంపద తరలిపోయింది. ఎంత ఇసుక అక్రమ తరలింపులు కొనసాగితే.. అంతా కాసులు రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ, ఆర్టీవో శాఖలకు చెందిన కొంతమంది అధికారుల ఆస్తులను పెంచుతున్నాయి. కానీ గంగమ్మ తల్లి గర్భశోకం పెడుతుంది. ఇసుక మాఫియాకు కావాల్సింది ఇసుక, అధికారులకు కావాల్సింది కాసులు. ఇంకేముంది భారీ యంత్రాలతో మంజీరా నదిని కొల్లగొడుతూ కోట్లు దండుకుంటున్నారు. వీరందరూ అధికార పార్టీకి చెందిన అనుచరులు, నేతలు. అయితే ఇది ఇలా ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు పడక గదుల నిర్మాణాలకు స్వస్తి పలికి, స్థలం ఉంటే ఇంటి నిర్మాణం కోసం ఐదు లక్ష రూపాయలు అందిస్తామని దీనికి ఇందిరమ్మ ఇల్లు అనే నామకరణం చేశారు. ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇల్లు మొదటి విడతగా మంజూరు చేసినట్లు సంబంధిత శాఖ అధికారులు, సంబంధిత శాఖ మంత్రి వెల్లడించారు. రెండవ విడత ఈ ఉగాది పండుగ రోజు నుంచి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని ప్రకటించారు సంబంధిత శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. సరే ఇంతవరకు ఓకే. కానీ ఏ నియోజకవర్గంలో ఏ మండలాలకు ఎన్ని ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశారు?, ఇన్ని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి?. ఈ వివరాలన్నీ సంబంధిత రెవెన్యూ శాఖ అధికారుల వద్ద, గృహ నిర్మాణ శాఖ అధికారుల వద్ద ఉంటాయి. కానీ వీటి గురించి వివరాలు అడిగితే మా శాఖ వద్ద లేవు, మా శాఖ వద్ద లేవు అని సంబంధిత శాఖ అధికారులు చేతులు ఎత్తివేస్తున్నారు. సరే వివరాలు మీడియాకు ఇవ్వకుండ పర్వాలేదు, ఓ పేదోడు నీడ కల్పించుకుంటున్నా అంటే కుటుంబానికి అధికారులు, మీడియా సహకరించాలి. కానీ ఒక్కొక్క నియోజకవర్గంలో, ఒక్కొక్క మండలంలో, ఒక్కొక్క గ్రామంలో ఎన్ని ఇందిరమ్మ ఇల్లు కొనసాగుతున్నాయి. ఒక్కొక్క ఇంటికి నిర్మాణం కోసం ప్రభుత్వ లెక్కల ప్రకారం రెండు విడతలుగా 10 ట్రాక్టర్ల ఇసుక అందించవలసి ఉంటుంది. దీనిని గ్రామపంచాయతీ కార్యదర్శి ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం ముగ్గు పోసి ఆ ఇంటి నిర్మాణం కోసం కావలసిన ఇసుక, మొరం కోసం అనుమతులు ఇస్తారు. దీనిని ఎంపీడీవో ఆమోదించి రవాణా కోసం రెవెన్యూ శాఖకు వివరాలు అందజేస్తారు. తుదిగా నిర్ణయం తీసుకునేది రెవెన్యూ శాఖ. వాస్తవంగా ఏ గ్రామంలో కూడా 10 నుంచి 50 ఇండ్లు లోపలే నిర్మాణాలు కొనసాగుతున్నాయి. కానీ వారానికి రెండు రోజులు బీర్కూర్, బిచ్కుంద, పోతంగల్, కోటగిరి, బోధన్ రెవెన్యూ అధికారులు ఇందిరమ్మ ఇంటి నిర్మాణాల కోసం 500 రూపాయలు డీడీలు కడితే ఒక ట్రాక్టర్ ఇసుక ఇందిరమ్మ ఇంటికి తీసుకు వెళ్లడానికి రెవెన్యూ అధికారులు వే బిల్లులు జారీ చేస్తారు. కానీ గమ్మత్తు జరిగేదంతా ఇక్కడే. ఒక్క వే బిల్లుతో సాయంత్రం వరకు ఐదు ట్రాక్టర్లకు పైగా ఇసుక ఇందిరమ్మ ఇంటి పేరుట బయట మార్కెట్లోకి తరలించకపోతున్నారు. ఇది సర్వం ఎరిగిన సత్యం. దీంట్లో రెవెన్యూ శాఖకు, పోలీస్ శాఖకు, ఆర్టీవో శాఖలకు చేతినిండా సొమ్ము అందుతుంది. ఇంకేముంది పేరు ఇందిరమ్మ తరలించేది బయట మార్కెట్లోకి 3000 నుంచి 4 వేల రూపాయల వరకు బాన్సువాడలో బీర్కూర్, కిష్టాపూర్, చించోలి గ్రామాల నుంచి ఇసుక అమ్మకాలు జరుగుతున్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం చూసుకుంటే ఒక గ్రామంలో 20 ఇల్లు నిర్మాణం జరిగితే వాటికి ఒక ఇంటికి రెండు విడతలుగా 10 ట్రాక్టర్లు మాత్రమే ఇసుక ఇవ్వాలని ప్రభుత్వ నిబంధనలు. కానీ ఏ గ్రామంలో కూడా పదికి మించి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు కొనసాగడం లేదు. కానీ ఒక బీర్కూరు మండలం తీసుకుంటే వారానికి రెండు రోజులు చించొల్లి, కిష్టాపూర్, బీర్కూర్ నుంచి ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక తరలించుకోవడానికి రెవెన్యూ శాఖ వే బిల్లులు జారీ చేస్తుంది. కానీ చించోళ్లిలో 100 ట్రాక్టర్ల పైగా ఉన్నాయి, రెండు రోజులు ఇసుక తరలింపుకు వీరికి అనుమతులు ఇస్తారు. 100 ట్రాక్టర్లు రోజుకు ట్రాక్టర్ల ఇసుక తరలించకపోతున్నారు, అయితే ఇందిరమ్మ ఇల్లు ఇన్ని నిర్మాణం జరుగుతున్నాయి, ఇంత పెద్ద మొత్తంలో ఇసుక ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఇది రెవెన్యూ అధికారులకు, పోలీస్ శాఖకు తెలియదా? తెలిసి ఈ అక్రమ దందాకు సహకరిస్తున్నారా? అన్నది ప్రశ్నక మిగిలిపోతుంది. అయితే కిష్టాపూర్ లో 100 ట్రాక్టర్లు ఉన్నాయి వీటి కూడా వారానికి రెండు రోజులు ఇసుక తరలించుకోవడానికి అనుమతులు ఇస్తారు. ఇది కూడా ఇదే బాగోతం. పేరు ఇందిరమ్మ ఇల్లు, అమ్ముకునేదంతా ,బయట మార్కెట్లో అధిక ధరలకు. దీనికి కళ్లెం వేయాల్సిన సంబంధిత శాఖ అధికారులు ముడుపులకు ఆశపడుతున్నారు. దీనివల్ల ఇందిరమ్మ ఇళ్ల పేట ఇసుక అక్రమంగా తరలిపోతుంది. ఒక బీర్కూర్ మండలం కాదు, పొతంగల్, బిచ్కుంద, సాలు రా, బోధన్ మండలాల్లో ఇదే బాగోతం కొనసాగుతుంది. దీనిని దృష్టిలో పెట్టుకొని నిజామాబాద్ కలెక్టర్ ఆల త్రిపాఠి అక్రమ ఇసుక రవాణా కు అడ్డుకట్టు వేయడానికి ఎవరైతే ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకుంటారు ,వారు ఆన్లైన్లో ఇసుక నమోదు చేసుకుని రెవిన్యూ శాఖ ద్వారా వే బిల్లులు తీసుకొని ఇసుక తీసుకువెళ్లాలని నిబంధన తీసుకువచ్చారు. కానీ ఈ నిబంధన కామారెడ్డి జిల్లాలో కొనసాగడం లేదు. అంతా ఆఫ్ లైన్ లోనే అధికారికి ఎవరికి ఇష్టముంటే వారికి వే బిల్లులు రాసి ఇవ్వడమే. ఒక్కసారి ఒక ట్రాక్టర్ 500 రూపాయలు డిడి కడితే అదే డిడి పై రెవెన్యూ శాఖ అధికారులు వే బిల్లులు అందిస్తారు. ఆ ఒక్క వే బిల్లు పైనే ఐదు ట్రిప్పుల ఇసుక దోచుకుపోతున్నారు. వాస్తవానికి ప్రతి ట్రాక్టర్ కు 500 రూపాయలు డిడి కట్టాల్సి ఉంటుంది, ఆ డి డి ని చూసి రెవిన్యూ అధికారులు వే బిల్లులు అందజేస్తారు. ఒక ట్రాక్టర్ ఇంద్రమ్మ ఇంటికి వెళ్ళగానే అక్కడ గాని, ఇక్కడికి వచ్చిన తర్వాత గాని సంబంధిత శాఖ అధికారి ఆ ట్రాక్టర్ వద్ద ఉన్న వే బిల్లును తీసుకొని, మరో ట్రాక్టర్ కు మరో వే బిల్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ఎక్కడ కూడా కొనసాగడం లేదు. ఒక ట్రాక్టర్ కు ఇంజన్ కు నెంబర్ ఉంటే, ట్రాలీకి నెంబర్ ఉండదు. ట్రాలీ నెంబర్ వేరే, ఇంజన్ నెంబర్ వేరే. దీంతో ఇసుక బహిరంగంగా ప్రధాన రహదారుల గుండా తరలించుకుని పోతుంటారు. కానీ ఎక్కడ కూడా పోలీస్ శాఖ గాని, ఆర్టీవో శాఖ గాని ఏ ట్రాక్టర్లు ముట్టుకునేది లేదు, ముడుపులు తీసుకోవడమే వారి పని. ఇది కామారెడ్డి జిల్లాలో కొనసాగుతున్న ఇసుక బాగోతం. దీంట్లో బాగుపడుతుంది కేవలం రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ, ఆర్టీవో శాఖ, కొంతమంది దళారులు . ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి ఏ గ్రామంలో ఎన్ని ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం కొనసాగుతుంది అని క్షేత్రస్థాయిలో పరిశీలించి ఒక్కొక్క ఇంటి నిర్మాణం కోసం రెండు విడతలుగా ఒకసారి ఐదు ట్రాక్టర్లు, మరో విడతగా ఐదు ట్రాక్టర్లు ఇసుక అందించవలసి ఉంటుంది. ఇది ఇలా ఉంటే సందట్లో సడే మియా అనే విధంగా కొంతమంది విలేకరులు తాము ఇంటి నిర్మాణం చేపట్టుకుంటున్నామని తప్పుడు మాటలు చెప్పి, అధికారుల వద్ద నుంచి ఒక నయా పైసా డిడి కట్టకుండా, ఐదు నుంచి 10 ట్రాక్టర్లు ఇసుక దోచుకుపోతున్నారు. వీరికి ఇవ్వకుంటే తమపై ఏదైనా వార్తలు రాస్తారని అధికారులకు భయం. అందుకే ఉదయం లేవగానే ఇసుక కోసం కొంతమంది విలేకరులు రెవెన్యూ కార్యాలయం ముందు కాపలా కాస్తున్నారు. సంబంధిత శాఖ అధికారులకు ఏదో మాయమాటలు చెప్పి వే బిల్లులు పొంది అక్రమంగా ఇసుక తరలించకపోతున్నారు. ఒకవేళ ఇంటి నిర్మాణం చేసుకుంటే డిడి కట్టాల్సింది కదా? అది ఏం లేదు కేవలం తాను ఒక సీనియర్ విలేకరిని అని చెప్పుకుంటూ కొంతమంది ఈ ఇసుక అక్రమాలకు పాల్పడుతున్నారు. ఏదో ఒక రూపంలో కొంతమంది విలేకరులకు రోజు ఎంత కొంత వారి జేబు నిండాల్సిందే. లేకుంటే కొంతమందిని బ్లాక్ మెయిల్ చేస్తుంటారు. ఇప్పటికే కొంతమంది పై పోలీస్ శాఖ నిగా పెట్టింది. ఎవరికైనా బ్లాక్ మెయిల్ చేసినట్లు ఫిర్యాదులు వస్తే ఖచ్చితంగా వారిపై శాఖపరిమైన చర్యలు తీసుకోవడానికి జిల్లా పోలీస్ యంత్రాంగం సిద్ధంగా ఉంది. కానీ విలేకరుల జోలికి పోవడం ఎందుకు అన్న రీతిలో కొంతమంది అధికారులు వారు చెప్పిన విధంగా తల ఊపడం, వారికి ఇష్టం వచ్చినట్లు వే బిల్లులు అందిస్తున్నారు. శనివారం బిచ్కుంద మండలం ఖతిగావ్ మంజీరా నది నుంచి ఇందిరమ్మ ఇళ్ల కోసం ఇసుక తరలింపు బిచ్కుంద రెవిన్యూ శాఖ అధికారులు అనుమతులు ఇచ్చారు. సుమారుగా 150 ట్రాక్టర్ల పైగా ఉదయం ఏడు గంటలకు మంజీరా నదిలో నుంచి ఇసుక నింపి వే బిల్లుల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం చూస్తే ఎక్కడైనా జాతరకు ట్రాక్టర్లు వెళ్తున్నాయా? లేక రాజకీయ నాయకుని బహిరంగ సభకు ట్రాక్టర్లు సిద్ధం చేశారా? అన్న విధంగా పచ్చని పంటలో నుంచి చూస్తే కనిపించే దృశ్యం ఇది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular