– కవిత కీలక ప్రకటన
నిజామాబాద్ ఏప్రిల్ 25న కొత్త పార్టీ.. కవిత కీలక ప్రకటన పార్టీ ఏర్పాటుపై కల్వకుంట్ల కవిత కీలక ప్రకటన చేశారు. ఏప్రిల్ 25న పార్టీ పేరు ప్రకటిస్తామని తెలిపారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక ప్రకటన చేశారు. కొత్త పార్టీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. నిజామాబాద్‌లోని జాగృతి కార్యాలయం లో ఆమె విలేకరులతో మాట్లాడారు
నంబర్ వన్ పార్టీగా..
తెలంగాణలో కొత్త పార్టీ పెడుతున్నట్లు కవిత తెలిపారు. ఏప్రిల్ 25న ఉదయం 10 గంటలకు ముహూర్తం ఉందన్నారు. మేడ్చల్‌లో మునీరాబాద్‌లోని ఓ ఫంక్షన్ హాల్లో పార్టీని ప్రకటిస్తామన్నారు. రాష్ట్రంలో, రాజకీయాల్లో మార్పు రావాలనుకున్న వారు రావాలని ఆహ్వానించారు. ఆ రోజు పార్టీ పేరు ప్రకటించి, జెండా ఎగురవేస్తామన్నారు. ఉదయం 8 గంటల్లోపు కార్యకర్తలు చేరుకోవాలని సూచించారు.
నిజామాబాద్ కోడలిని..
కవిత తెలంగాణ ప్రజలకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. రాముడు తన ప్రజలను గుండె హత్తుకొని పాలన చేశారన్నారు. ఈ క్రమంలో శ్రీరామ నవమి రోజు కొత్త పార్టీపై ప్రకటన చేస్తున్నట్లు తెలిపారు. తాను నిజామాబాద్ కోడలిని అన్నారు. ఇక్కడ పుట్టిన ఏ ఆలోచన అయినా విజయవంతం అవుతుందన్నారు.
కొత్త పార్టీ అవసరం
రాష్ట్రంలో నీళ్లు, నియామకాలు సాధించుకోలేక పోయామని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పార్టీలు ప్రజలను పట్టించుకోవడం లేదన్నారు. దీంతో కొత్త పార్టీ ఏర్పాటు అవసరం ఉందన్నారు. ఆ పార్టీ అన్ని వర్గాల్లో వెలుగులు నింపాలన్నారు. ఆ లక్ష్యంతోనే తాము పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పోరాటాలు చేశాం తాను తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు కవిత తెలిపారు. రాష్ట్రం రాకముందు తెలంగాణ ఉద్యమంలో అనేక పోరాటాలు చేశామన్నారు. రాష్ట్రం వచ్చాక సైతం ప్రజల సమస్యలను లేవనెత్తినట్లు గుర్తు చేశారు. ఖమ్మం వెలుగుమట్లలో డీఎస్పీ పార్టీతో కలిసి నిర్వాసితుల కోసం నిరాహార దీక్ష చేశామన్నారు. దీంతో ప్రభుత్వం దిగి వచ్చి పట్టాలు ఇచ్చిందన్నారు.
తరలి రావాలి
కొత్త పార్టీ ప్రకటన సందర్భంగా నిర్వహించే కార్యక్రమానికి జాగృతి నాయకులు, కార్యకర్తలతో పాటు అన్ని వర్గాల ప్రజలు తరలి రావాలని కోరారు. ప్రజల సమస్యల పరిష్కారమే తమ పార్టీ పని చేస్తుందన్నారు.రాష్ట్రంలో బలమైన రాజకీయ శక్తి కావాలన్నారు. సర్వోదయ తెలంగాణ సాధన కోసమే తాము పార్టీ పెడుతున్నట్లు తెలిపారు. కాశీకి వెళ్లి శివుడికి అభిషేకం చేసి వస్తామన్నారు. అనంతరం వచ్చే నెల 25న పార్టీ పేరు, అజెండా, జెండా ప్రకటిస్తామన్నారు. ఈ నెల రోజుల్లో పార్టీ ఏర్పాటుకు కావాల్సిన ఏర్పాట్లు సిద్ధం చేస్తామన్నారు.
నంబర్ వన్ పార్టీగా..
తాము ఎవరికి బీ పార్టీగా ఉండబోమని కవిత అన్నారు. నంబర్ వన్ పార్టీగా ఎదుగుతామని ధీమా వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో అధికారంలోకి వస్తామన్నారు. రాముడిని ఆదర్శంగా తీసుకొని పని చేస్తామన్నారు. అన్నివర్గాలను కలుపుకొని వెళ్తామన్నారు. తాను ఎక్కడి నుంచి పోటీ చేస్తానని పార్టీ ఏర్పాటు అనంతరం ప్రకటిస్తానన్నారు. తెలంగాణలో ప్రస్తుతం ప్రాంతీయ పార్టీ లేదన్నారు. తమ పార్టీ ప్రతి ఇంటి పార్టీ అవుతందున్నారు. ఉద్యమకారుల అనుభవాలను తీసుకుంటామన్నారు


