Homeతెలంగాణనిజామాబాద్మాజీ సర్పంచ్ లను బోధన్ రూరల్ ఎస్సై మచ్చందర్ రెడ్డి  అరెస్టు చేశారు.

మాజీ సర్పంచ్ లను బోధన్ రూరల్ ఎస్సై మచ్చందర్ రెడ్డి  అరెస్టు చేశారు.

📰 Generate e-Paper Clip

బోధన్ మండల మాజీ సర్పంచ్ లు అసెంబ్లీ ముట్టడి పిలుపు మేరకు బోధన్ రూరల్ ఎస్సై మచ్చందర్ రెడ్డి  ముందస్తు అరెస్ట్ చేశారు. చేతకాని ప్రభుత్వం,సిగ్గుశరం లేని ప్రభుత్వం,మాజీ సర్పంచ్ ల పదవీ కాలం ముగిసి రెండున్నర సంవత్సరాలు గడిచిన పెండింగ్ బిల్లులు చెల్లించకుండ మాటి,మాటికి అరెస్ట్ లు చేయడం పిరికిపంద చర్య అన్నారు. దమ్ముంటే చేతనైతే పెండింగ్ బిల్లులు చెల్లించి చూపించండి అన్నారు. చేతకాక పోతే రాజీనామా లు చేసి మూసుకొని ఇండ్లల్లో కూర్చోండి. కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు వేల కోట్ల రూపాయలు నిధులు విడుదల చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మాజీ సర్పంచ్ లకు ఇవ్వాల్సిన పెండింగ్ బకాయిలు చెల్లించక పోగా ఈ అరెస్ట్ లు చేయడం చాలా దురదృష్టం తెలిపారు. ఈ అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోపు మాజీ సర్పంచ్ ల పెండింగ్ బిల్లులు చెల్లించక పోతే అసెంబ్లీ ముట్టడి కాదు ఇంకా తీవ్ర మైన చర్యలు చేపడతాం అని డిమాండ్ చేశారు. అరెస్ట్ చేసిన మాజీ సర్పంచ్ లలో సిర్ప సుదర్శన్, నానా పటేల్,కోర్వ గంగాధర్, తారాచంద్, గంగారాం లు ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular