📰 Generate e-Paper Clip

కేరళ ముఖ్యమంత్రి హైన చేసిన వాక్యాలను వెనక్కు తీసుకోవాలి.

 

– సిపిఎం నాయకులు వాక్యాలను తప్పుపట్టారు.

బోధన్ : ఏప్రిల్ 08 జన సంఘర్షణ

బోధన్ పట్టణంలో బుధవారం మధ్యాహ్నం ప్రెస్ మీట్ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఎ. రమేష్ బాబు మాట్లాడుతూ…తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేరళ ముఖ్యమంత్రి పై చేసిన వాక్యా లను తప్పుపట్టారు. కేరళ ముఖ్యమంత్రి పిన్నారై విజయన్ నిరంతరం ప్రజల కోసం వారి అభివృద్ధి కోసం పనిచేస్తున్నారని అన్నారు. అదే విధంగా ఆయన కృషి వల్ల విద్యా వైద్య రంగాల్లో దేశంలోనే మొట్టమొదటి స్థానంలో సేవ చేస్తున్న ముఖ్యమంత్రి అని కొని అన్నారు. అటువంటి నాయకు డి పై రేవంత్ రెడ్డి ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. చేసిన ఆరోపణలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి రెండు న్నరు సంవత్సరాలు అవుతున్న ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం సిగ్గుచేటు అన్నారు. ఇలా ప్రజల్ని ఎంతకాలం మోసం చేస్తారని అన్నారు. కేరళ ముఖ్యమంత్రి  ఆ రాష్ట్ర సంక్షేమం తప్ప మరో ఆలోచన లేదని అక్కడ అతి పేదరికం లో ఉన్న వారికి విద్య, వైద్య సౌకర్యాలు ఉపాధి ,గృహ నిర్మాణం చేసి అత్యంత పేదరికం లేని రాష్ట్రంగా చేశారు అని తెలిపారు అటువంటి మచ్చలేని మనిషి పైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతు … ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. కమ్యూనిస్టు లు నిరంతరం ప్రజల కోసం పనిచేస్తారని ప్రజల అభివృద్ధి తమ అభివృద్ధిగా భావిస్తారని ఈ వాస్తవాలను తెలుసుకోవాలని, ఆయన తన వైఖరిమార్చుకోవాలని క్షమాపణలు చెప్పాలని చేశారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వెంకటేష్, శంకర్ గౌడ్, జిల్లా కమిటీ సభ్యులు వేషాల గంగాధర్, సీనియర్ నాయకులు ఎమ్ . గంగాధర్ అప్ప తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular