Homeక్రైమ్ న్యూస్జక్రాన్ పల్లి మండల ఆర్గుల్ రోడ్డు ప్రమాదములో 13మందికి గాయాలు, ముగ్గురికి తీవ్రగాయాలు

జక్రాన్ పల్లి మండల ఆర్గుల్ రోడ్డు ప్రమాదములో 13మందికి గాయాలు, ముగ్గురికి తీవ్రగాయాలు

📰 Generate e-Paper Clip

జక్రాన్ పల్లి మండల ఆర్గుల్ ప్రమాదములో 13మందికి గాయాలు ముగ్గురికి తీవ్రగాయాలు

బోధన్ : ఏప్రిల్ 24 జన సంఘర్షణ

జక్రాన్ పల్లి మండల ఆర్గుల్ గ్రామం జాతీయ రహదారి 44 పై భారీ రోడ్డు ప్రమాద సంఘటన స్థలాన్ని పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్

ప్రమాదములో 13మందికి గాయాలు ముగ్గురికి తీవ్రగాయాలు

క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులకు ఆదేశాలు జారి

జక్రాన్ పల్లి మండలంలోని అర్గుల్ జాతీయ రహదారి 44 పై , జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురుకు గాయాలయ్యాయి. శుక్రవారం రోజున రాత్రి సుమారు 7:30 ప్రాంతంలో కామారెడ్డి నుండి ఆర్మూర్ వస్తున్న టీ.జి.యస్.ఆర్.టీ.సీ. టి.యస్.16.యు.బీ.2255. నెంబర్ గల అద్దె బస్సు ను సాయంత్రం సుమారు 7:30 సమయంలో అర్గుల్ గ్రామంలో ,ప్రయాణికుల దిoచివేస్తూ ఉండగా వెనుక నుండి హర్యానా రాష్ట్రానికి చెందిన యచ్.ఆర్‌46.యు 5859 నెంబర్ గల లారీ, బస్సును ఢీకొట్టడంతో అందులో 13మందికి గాయాలయ్యాయి.

హుటాహుటిన నిజామాబాదు పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్.,* గారు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను అంబులెన్స్ లో ప్రభుత్వ ఆసుపత్రి ఆర్మూర్ కు తరలించాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అనంతరం సంఘటనకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను తెలుసుకొని రోడ్డు ప్రమాదంలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు రోడ్ స్టాపర్లు , రోడ్డు డివైడర్లు ఏ విధంగా ఏర్పాటు చేయాలో సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ట్రాఫిక్ ను నియంత్రించి వాహనాలను జెసిబి సహాయంతో పక్కకు తరలించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి ఆర్మూర్ అత్యవసర వైద్య సేవలు అందించడం జరుగుతుంది. మెరుగైన వైద్య సేవల కోసము క్షతగాత్రులను నిజామాబాదు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఈ సందర్భంగా ఆర్మూర్ ఎసిపి శ్రీ వెంకటేశ్వర్ రెడ్డి , ఆర్మూర్ ఎస్హెచ్ఓ శ్రీ సత్యనారాయణ గౌడ్ , జక్రంపల్లి ఇంచార్జి ఎస్సై డిచ్పల్లి ఎస్సై శ్రీ ఆరిఫ్ , ఇందల్వాయి ఎస్సై శ్రీ సందీప్ మరియు సబ్ డివిజన్ పోలీస్ అధికారులు మరియు వైద్య సిబ్బంది తదితరులున్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular