Homeహైదరాబాద్కూకట్పల్లిప్రైమ్ ఏరియాలో ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ నిర్మాణానికి ఏర్పాట్లు

ప్రైమ్ ఏరియాలో ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ నిర్మాణానికి ఏర్పాట్లు

📰 Generate e-Paper Clip

హైదరాబాద్ సిటీ, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రతినిధి అంజిబాబు నాగుల, ఆగస్టు12, (జన సంఘర్షణ): కూకట్పల్లి నియోజకవర్గం కేపీహెచ్‌బీలోని నెక్సస్ మాల్ వెనుకవైపు ఉన్న హౌసింగ్ బోర్డు స్థలంలో అత్యంత విలువైన, ప్రైమ్ ఏరియాలో నిర్మించనున్న ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ నిర్మాణానికి సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ బండి రమేష్ తో కలిసి కలెక్టర్ మనోజ్ చౌదరి స్థలాన్ని పరిశీలించి, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు గాదె శివ పాల్గొని, ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ నిర్మాణం మరియు శంకుస్థాపన కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. కూకట్‌పల్లి వంటి అత్యంత ప్రైమ్ ప్రాంతంలో పేద, మధ్యతరగతి ప్రజలకు సొంతింటి కలను సాకారం చేసే దిశగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టడం అభినందనీయమని గాదె శివ పేర్కొన్నారు. ఈ స్థల పరిశీలనలో కలెక్టర్ మనోజ్ చౌదరితో పాటు జిహెచ్ఎంసి అధికారులు, హౌసింగ్ బోర్డు అధికారులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular