Homeతెలంగాణహైదరాబాద్తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం నూతన ప్రతినిధులకు నియామక పత్రాల ప్రదానం

తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం నూతన ప్రతినిధులకు నియామక పత్రాల ప్రదానం

📰 Generate e-Paper Clip

హైదరాబాద్ సిటీ ప్రతినిధి నాగుల అంజిబాబు, అక్టోబర్ 08,(జన సంఘర్షణ):

హైదరాబాద్ నగరంలో తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నియమితులైన వివిధ డివిజన్ల, విభాగాల ప్రతినిధులకు నియామక పత్రాల ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమం తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు పరుచూరి సురేష్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు గట్టు రామచంద్రరావు ముఖ్య అతిథిగా పాల్గొని, నూతనంగా ఎంపికైన సభ్యులకు నియామక పత్రాలను స్వయంగా అందజేశారు. అదేవిధంగా, ఈ కార్యక్రమంలో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మహిళా అధ్యక్షురాలు శ్రీమతి బెల్లంకొండ జ్యోతి గౌడ్ విశేషంగా పాల్గొన్నారు. సంఘం బలోపేతానికి, గౌడ సామాజిక వర్గ అభివృద్ధికి అందరూ ఐక్యంగా కృషి చేయాలని ఈ సందర్భంగా నాయకులు పిలుపునిచ్చారు.

నియామక పత్రాలు అందుకున్న నూతన సభ్యుల వివరాలు:

మొగులగాని సరిత గౌడ్ – కళాకారుల విభాగం హైదరాబాద్ కన్వీనర్.

కుర్ర కృష్ణవేణి గౌడ్ – బహుదూర్ పల్లి డివిజన్ అధ్యక్షురాలు.

చెలిమిన స్వరూప గౌడ్ – బహుదూర్ పల్లి డివిజన్ జనరల్ సెక్రటరీ.

రావుల మంజుల గౌడ్ – బహుదూర్ పల్లి డివిజన్ ఉపాధ్యక్షురాలు.

మొగుదాల అరుణ్ గౌడ్ – వనస్థలిపురం డివిజన్ అధ్యక్షుడు.

ముత్తగోని మహేష్ గౌడ్ – రామ్ గోపాల్ పేట్ డివిజన్ అధ్యక్షుడు. ఉప్పాల సాయికుమార్ గౌడ్ – నిజాంపేట్ డివిజన్ అధ్యక్షుడు. దేవర్ల కవిందర్ గౌడ్ – నెక్నంపూర్ డివిజన్ అధ్యక్షుడు.నూతనంగా బాధ్యతలు చేపట్టిన నాయకులందరికీ సంఘం నాయకత్వం తరపున ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular