Homeఎడిటోరియల్బైక్ ఢీకొని మహిళ మృతి

బైక్ ఢీకొని మహిళ మృతి

📰 Generate e-Paper Clip

 

తలపై తీవ్ర గాయం కావడంతో ఆస్పత్రిలో మృతి

నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల బ్యూరో/, ఎడపల్లి /అక్టోబర్ 8 / (జన సంఘర్షణ)

ఎడపల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఎన్‌హెచ్‌–63 రహదారి దాటుతున్న మహిళను ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఆమె మృతి చెందిన ఘటన ఎడపల్లిలో చోటుచేసుకుంది.

ఎడపల్లికి చెందిన ఏషాల కళావతి రహదారి దాటుతుండగా, నిజామాబాద్‌ నుంచి బోధన్‌ వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న గోవింద్‌సింగ్ ఆమెను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో కళావతికి తీవ్ర గాయాలయ్యాయి.

వెంటనే ఆమెను అంబులెన్స్‌లో నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే కొద్దిసేపటి తర్వాత తలకు తగిలిన తీవ్ర గాయం కారణంగా కళావతి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

ఈ ఘటనపై మృతురాలి కుమారుడు రాజు ఎడపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎడపల్లి ఎస్‌ఐ ముత్యాల రమ తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular