Homeబోధన్పాత పాఠశాల భవనం కూల్చివేత.. కొత్త భవనం ఎప్పుడో?

పాత పాఠశాల భవనం కూల్చివేత.. కొత్త భవనం ఎప్పుడో?

📰 Generate e-Paper Clip

పాత పాఠశాల భవనం కూల్చివేత.. కొత్త భవనం ఎప్పుడో?

రూ.20 లక్షలు మంజూరైనా నిలిచిపోయిన నిర్మాణం.. నిధులు తిరిగి వెళ్లాయని గ్రామస్తుల ఆవేదన

నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల బ్యూరో/ కోటగిరి / అక్టోబర్ 8/(జన సంఘర్షణ)

కోటగిరి మండలం, లింగాపూర్: లింగాపూర్ గ్రామంలోని ప్రభుత్వ బాలుర పాఠశాల నూతన భవన నిర్మాణం నిలిచిపోవడంతో విద్యార్థులు, గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పాఠశాల భవన నిర్మాణానికి గతంలో రూ.20 లక్షలు మంజూరయ్యాయని, అయితే టెండర్ ప్రక్రియ పూర్తికాకముందే పాత హైస్కూల్ భవనాన్ని కూల్చివేశారని తెలిపారు. అనంతరం ప్రభుత్వం మారడంతో మంజూరైన నిధులు తిరిగి వెళ్లిపోయినట్లు అధికారులు తెలిపారని పేర్కొన్నారు. దీంతో విద్యార్థులు ప్రత్యామ్నాయ వసతుల్లో చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.

భవన నిర్మాణం కోసం గ్రామస్తులు, ఉపాధ్యాయులు పలుమార్లు విజ్ఞప్తులు చేయడంతో పాటు, ఎంఈఓ జిల్లా విద్యాశాఖ అధికారులకు, కలెక్టర్‌కు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ ఇప్పటివరకు నిర్మాణానికి సంబంధించి ఎలాంటి ఉత్తర్వులు వెలువడలేదని తెలిపారు.

విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణమే నిధులు మంజూరు చేసి నూతన పాఠశాల భవన నిర్మాణాన్ని చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular