* ధన్ పాల్ లక్ష్మీ బాయి విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో పట్టు చీరల పంపిణీ…
నిజామాబాద్ సిటీ / అక్టోబర్ 9 ( జన సంఘర్షణ )
ఇందూరు : దుర్గామాతకు సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నామని ధన్ పాల్ లక్ష్మీ బాయి విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్టు డైరెక్టర్లు ఉదయ్ కుమార్, ప్రణయ్ కుమార్, డాక్టర్ వినయ్ కుమార్ లు పేర్కొన్నారు. నగరంలోని మిర్చి కంపౌండ్ లో గల డీఎస్ఎన్ కార్యాలయంలో అమ్మవారి మండప నిర్వాహకులకు ట్రస్టు ఆధ్వర్యంలో పట్టు చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ట్రస్టు ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఇందులో భాగంగా గత పది సంవత్సరాలుగా అమ్మవారి మండపాలకు పట్టుచీరలను పంపిణీ చేస్తున్నామన్నారు. నిర్వాహకులు భక్తిశ్రద్ధలతో నియమ నిబంధనలతో నవరాత్రులను జరుపుకోవాలన్నారు. ఇందూరు నియోజకవర్గంలోని ప్రతి మండపానికి తమ వంతు సహకారంగా చీరలను అందజేస్తున్నామన్నారు. హిందూ పండుగల్లో అమ్మవారి నవరాత్రులకు ఎంతో ప్రత్యేకత ఉంటుందన్నారు. ప్రతి సంవత్సరం ఇందూరులో మండపాలు పెరుగుతున్నాయని, యువత భక్తి మార్గంలో పయనిస్తున్నారన్నారు. లోకమాత దుర్గాదేవి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి, 19వ డివిజన్ కార్పొరేటర్ నాగోల్ల లక్ష్మీనారాయణ, కార్పొరేటర్లు మఠం పవన్, బంటు రాము, మల్కాయి మహేందర్, బంటు ప్రీతి ప్రవీణ్, ప్రసూన శ్రీనివాస్ రెడ్డి, జ్యోతి మురళి, ధాత్రిక పరమేశ్వర్, నాయకులు పవన్ ముందడ, మారావార్ కృష్ణ, శ్రీనివాస్, బాబీ సింగ్, మండల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.


