Homeతెలంగాణనిజామాబాద్అభివృద్ధి పనుల్లో నాణ్యత విషయంలో రాజీ పడేది లేదు!

అభివృద్ధి పనుల్లో నాణ్యత విషయంలో రాజీ పడేది లేదు!

📰 Generate e-Paper Clip

నగరంలోని నాలుగు డివిజన్లలో రోడ్డు పనులకు భూమిపూజ చేసిన ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ

నిజామాబాద్ ఉమ్మడి జిల్లా బ్యూరో/ అక్టోబర్ 16/జన సంఘర్షణ:

నిజామాబాద్ నగరంలో చేపట్టే అభివృద్ధి పనుల్లో నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడేది లేదని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ అన్నారు. నగర ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు.

నగరంలోని 23, 24, 6, 48వ డివిజన్లలో చేపట్టనున్న రోడ్డు నిర్మాణ పనులకు శుక్రవారం ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ భూమిపూజ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా చేపట్టాలని, ప్రజలకు దీర్ఘకాలికంగా ఉపయోగపడేలా రహదారులను నిర్మించాలని సూచించారు. నగర అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామని పేర్కొన్నారు.

నగరంలోని వివిధ డివిజన్లలో రోడ్డు సదుపాయాలు మెరుగుపడటం ద్వారా ప్రజలకు రాకపోకల్లో ఇబ్బందులు తగ్గనున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular