Homeతెలంగాణహైదరాబాద్ఘనంగా సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీలో బతుకమ్మ వేడుకలు

ఘనంగా సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీలో బతుకమ్మ వేడుకలు

📰 Generate e-Paper Clip

హైదరాబాద్ సిటీ ప్రతినిధి నాగుల అంజిబాబు, అక్టోబర్ 16, (జన సంఘర్షణ) :

సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని యూనివర్సిటీ ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ వేడుకల్లో యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ ఆచార్య వెల్దండ నిత్యానందరావు, రిజిస్ట్రార్‌ ఆచార్య కోట్ల హనుమంతరావు పాల్గొన్నారు. ఆచార్య బి.హెచ్ పద్మప్రియ, వివిధ శాఖల డీన్స్‌, టీచింగ్‌ ఫ్యాకల్టీ, నాన్‌ టీచింగ్‌ ఫ్యాకల్టీ సభ్యులు, విద్యార్థులు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొని బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ప్రకృతితో మమేకమైన జీవన సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను యూనివర్సిటీలో నిర్వహించడం ద్వారా తెలంగాణ సాంస్కృతిక వారసత్వం, సంప్రదాయాల ప్రాధాన్యాన్ని చాటిచెప్పారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థుల భాగస్వామ్యంతో వేడుకలు సందడిగా సాగాయి.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular