Homeతెలంగాణబాన్సువాడలో నూతన ఫంక్షన్ హాల్ ను ప్రారంభించిన బాన్సువాడ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి

బాన్సువాడలో నూతన ఫంక్షన్ హాల్ ను ప్రారంభించిన బాన్సువాడ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి

📰 Generate e-Paper Clip

రూ.1.40 కోట్లతో నిర్మించిన సాంస్కృతిక కళ్యాణ వేదికను ప్రారంభించిన పోచారం శ్రీనివాసరెడ్డి

నిజామాబాద్ ఉమ్మడి జిల్లా బ్యూరో/ అక్టోబర్ 12 / (జన సంఘర్షణ)

బాన్సువాడ పట్టణంలోని 1000 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కాలనీలో రూ.1 కోటి 40 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన సాంస్కృతిక కళ్యాణ వేదిక భవనాన్ని (ఫంక్షన్ హాల్) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యుడు పోచారం శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు.

ఈ కార్యక్రమానికి మాజీ రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు హాజరయ్యారు. నూతనంగా నిర్మించిన ఫంక్షన్ హాల్‌ను ప్రారంభించిన సందర్భంగా కాలనీవాసులు, పట్టణ ప్రజలకు ఈ భవనం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.

కాలనీవాసులు, పట్టణ ప్రజలు వివాహాలు, శుభకార్యాలు, ఇతర సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించుకోవడానికి ఈ సాంస్కృతిక కళ్యాణ వేదిక సౌకర్యవంతంగా ఉంటుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో బాన్సువాడ పట్టణ ప్రజాప్రతినిధులు, నాయకులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular