Homeఎడిటోరియల్బాన్సువాడలో విషాదం.. చెరువులో మునిగి దీక్షాపరుడి మృతి

బాన్సువాడలో విషాదం.. చెరువులో మునిగి దీక్షాపరుడి మృతి

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ ఉమ్మడి జిల్లా బ్యూరో/అక్టోబర్ 13:/(జన సంఘర్షణ)

నిజామాబాద్ జిల్లా బాన్సువాడ మండలం ఇబ్రహీంపేట్ గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. దుర్గామాత దీక్షలో ఉన్న ఓ వ్యక్తి చెరువులో స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు.

గ్రామానికి చెందిన సున్నపు శ్రీకాంత్ (30), తండ్రి సాయిలు, కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అక్టోబర్ 12న తనతో పాటు దుర్గామాత దీక్ష తీసుకున్న ఇతర స్వాములతో కలిసి గ్రామంలోని ఊర చెరువు వద్ద గల గంగమ్మ గుడి సమీపానికి స్నానం చేసేందుకు వెళ్లాడు.

ఈ క్రమంలో అందరూ చెరువులో స్నానం చేస్తుండగా, చెరువు లోతు ఎక్కువగా ఉండటంతో శ్రీకాంత్ ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయాడు. ఊపిరాడక ఆయన మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

మృతుడి భార్య సున్నపు సుమలత ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

లోతు తెలియని నీటిలోకి దిగవద్దు

చెరువులు, కుంటల్లో స్నానం చేసేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నీటి లోతు తెలియని ప్రాంతాల్లోకి దిగవద్దని పోలీసులు సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular