Homeతెలంగాణసీఎం రేవంత్ రెడ్డి పాఠశాలల్లో విద్యార్థులకు ఆటల కోసం ప్రత్యేక ప్రాధాన్యత

సీఎం రేవంత్ రెడ్డి పాఠశాలల్లో విద్యార్థులకు ఆటల కోసం ప్రత్యేక ప్రాధాన్యత

📰 Generate e-Paper Clip

సీఎం రేవంత్ రెడ్డి పాఠశాలల్లో విద్యార్థులకు ఆటల కోసం ప్రత్యేక ప్రాధాన్యత

– విజేతలను అభినందించిన టిపిసిసి ఉపాధ్యక్షుడు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్.

హైదరాబాద్, కూకట్పల్లి ప్రతినిధి అంజిబాబు, ఫిబ్రవరి 25,

( జన సంఘర్షణ )

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాఠశాలల్లో విద్యార్థులకు ఆటల కోసం అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నారని టిపిసిసి ఉపాధ్యక్షుడు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ పేర్కొన్నారు. గతవారం గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన సీఎం కప్పు కరాటే పోటీల్లో కూకట్పల్లి నియోజకవర్గానికి చెందిన ఇద్దరు గోల్డ్ మెడల్ ఒకరు బ్రాంజ్ మెడల్ సాధించారు.అండర్ 17 విభాగంలో మహమ్మద్ జుబేర్ 55 కిలోలు,18 ప్లస్ విభాగంలో సిహెచ్. సంజయ్ 60 కేజీలు గోల్డ్ మోడల్స్ 18 ప్లస్ విభాగంలో బిహెచ్.నమ్రత 61 కేజీ లో బ్రాంచ్ మెడల్ సాధించారు.వీరు మంగళవారం రోజు బండి రమేష్ ని హేమ దుర్గా భవన్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. ఆయన వీరికి శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రోజుల్లో కరాటే మహిళల ఆత్మ రక్షణతో పాటు పురుషులకు స్వీయ రక్షణలో ఎంతో ఉపయోగపడుతుందన్నారు.ప్రతి విద్యార్థి చిన్నతనం నుంచి కబాడీ కరాటే తో పాటు ఇతర ఆటలు ఆడటం ద్వారా మానసిక శారీరక ఆరోగ్యానికి ఎంతో ఉపయోగ ఉంటుందన్నారు. విజేతలకు రాష్ట్ర ప్రభుత్వం నగదు బహుమతి సైతం అందజేసిందని అన్నారు. విద్యార్థులకు కరాటేలో శిక్షణ ఇచ్చిన స్థానికుడు అబ్దుల్ బాకీ వాక్యాన్ని రమేష్ ఈ సందర్భంగా అభినందించారు. అలాగే మరింత మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చి కరాటే లో శిక్షణ ఇచ్చి రాష్ట్ర జాతీయ స్థాయిలో విజేతలుగా తీర్చిదిద్దాలని సూచించారు.ఈ కార్యక్రమంలో లక్ష్మయ్య,లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular