బోధన్ డివిజన్ లొ 11 వ రోజు జరుగుతున్న వ్యాపార వాణిజ్య శాస్త్రం పేపర్ -1,& రసాయన శాస్త్రం పేపర్ -1 ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పబ్లిక్ పరీక్షల కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన నిజామాబాద్ జిల్లా ఇంటర్ విద్య అధికారి టీ .రవి కుమార్ మరియు జిల్లా పరీక్షల నిర్వహణ కమిటీ రజియా సుల్తానా ద్వితీయ సంవత్సరం పరీక్షలలో కూడా ఎలాంటి మాస్ కాపీయింగ్ తావులేకాండ పరీక్షలు పక్కడబందీగా నిర్వహించాలని చీఫ్ సూపరింటెండెంట్ లకు, డిపార్ట్మెంటల్ మెంటల్ ఆఫీసర్ లకు నిర్వహించాలని అదేశించారు.రోజున గురువారం బోధన్ డివిజన్ లోని 12 పరీక్ష కేంద్రాలలో 4412 విద్యార్థులకు గాను విద్యార్థులు 4247 హాజరయ్యారు. 168 మంది విద్యార్థులు గైర్ హాజరయ్యారు జెనరల్ స్ట్రీమ్ విభాగం లో ప్రథమ సంవత్సర పరీక్షలు జిల్లాలో ప్రశాంతంగా ముగిశాయని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి టి. రవి కుమార్ తెలిపారు.


