బోధన్ పట్టణంలో సాండ్ బజార్ ప్రారంభం.
– నేటి నుండి సాండ్ బజార్ అందరికీ అందుబాటులో
బోధన్ పట్టణంలోని పాండు పారం వద్ద జర్నలిస్ట్ కాలనీ అలాగే డబుల్ బెడ్రూం ఇళ్ల వెనుకల సాండ్ బజార్ ఏర్పాటు చేయడమైనది. ఇందిరమ్మ ఇళ్లు, ప్రైవేట్ ఇళ్లు నిర్మించుకుంటున్న వారికి ఇబ్బందులు లేకుండా చేయాలనే ఉద్దేశంతో సబ్ కలెక్టర్ మరియు జిల్లా కలెక్టర్ ఈ సాండ్ బజార్ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఇందిరమ్మ ఇళ్లు నిర్మించేవారు మరియు ప్రైవేట్ గా ఇండ్లు నీర్మిoచుకొనే వారు మీ సేవ లేదా sand.telangana.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో ఇసుక బుక్ చేసుకొనగలరు. బుకింగ్ సమయంలో ఇందిరమ్మ ఇళ్లకు మెట్రిక్ టన్నుకు ₹500, ప్రైవేట్ ఇళ్లకు ₹875 చెల్లించవలయును. ఒక ట్రాక్టర్‌కు 4 మెట్రిక్ టన్నులు ఇవ్వబడును, ఇందిరమ్మ ఇళ్లకు ట్రాక్టర్‌కు ₹2,260, ప్రైవేట్ ప్రైవేట్ ఇండ్ల నిర్మాణానికి ₹3,842 చెలించవలెను.ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ముందుగా వార్డు ఆఫీసర్ వద్ద సాండ్ కూపన్ తీసుకుని, హౌసింగ్ శాఖ సంతకం చేయించుకుని, తహసీల్దార్ సంతకం తీసుకొని మీ సేవ లో బుక్ చేసుకోవలేను. ఆ తర్వాత వచ్చిన ఆర్డర్ కాపీని పాండు తర్ఫా వద్ద ఉన్న టి,ఎస్‌ఎండిసి సాండ్ బజార్‌కు తీసుకువెళ్లి టిఎస్ఎండిసి అధికారులు TSMDC వారికి ఇచ్చిన తర్వాత టిఎస్ఎండిసి వేరే వే బిల్ ఇచ్చినా తర్వాత ట్రాక్టర్ లో ఇసుక ను తూకం చేసి నింపిస్తారు.బోధన్ మండలం, బోధన్ పట్టణంలో ఎవరికైనా ఇసుక అవసరమైతే ఈ విధానాన్ని అనుసరించాలి. పట్టణంలో వార్డు ఆఫీసర్, ఎఈ హౌసింగ్ ద్వారా, గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శి ద్వారా కూపన్ తీసుకుని రావలి రేపటి నుంచి సాండ్ బజార్ అందరికీ అందుబాటులో ఉంటుందని మరియు మీ సేవ లేదా ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చునాని తీయజేయడమైనది సబ్ కలెక్టర్ ఒక పట్టణంలో తెలియజేశారు.


