Homeతెలంగాణఖమ్మంమద్యం మత్తులో తల్లిపై కుమారుడి దాడి…

మద్యం మత్తులో తల్లిపై కుమారుడి దాడి…

📰 Generate e-Paper Clip

 

ప్రాణాపాయ స్థితిలో మహిళ

భద్రాద్రి కొత్తగూడెం.ఇల్లెందు

(జన సంఘర్షణ)

జిల్లాలో ఘోర ఘటన చోటుచేసుకుంది. తొర్రూరు మండలం చర్లపాలెం గ్రామానికి చెందిన చిట్టిమల్ల లచ్చమను ఆమె కుమారుడు అజీమ్ మద్యం మత్తులో గొడ్డలితో దాడి చేసిన సంఘటన తీవ్ర కలకలం రేపింది. సమాచారం ప్రకారం, మద్యం మత్తులో ఉన్న అజీమ్ అకస్మాత్తుగా తల్లి లచ్చమపై గొడ్డలితో దాడి చేశాడు. ఈ దాడిలో లచ్చమకు రెండు చేతులు మరియు మెడ వద్ద తీవ్ర గాయాలు అయ్యాయి. దాడి అనంతరం ఆమె ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతూ ఉండగా స్థానికులు వెంటనే గమనించి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ దారుణ ఘటన గ్రామంలో తీవ్ర ఆందోళనకు దారి తీసింది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular