లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఫారెస్ట్ అధికారి
గుండాల ఏప్రిల్ 30 (జన సంఘర్షణ)
గుండాల మండలం నడిమిగూడెం ఫారెస్ట్ బీట్ అధికారి బానోతు నరేష్, గురువారం ఒక పోడు రైతు నుండి రూ. 10 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ వై. రమేష్ ఆధ్వర్యంలో ఈ మెరుపు దాడి జరిగింది.తన పని కోసం ఫారెస్ట్ అధికారి లంచం డిమాండ్ చేస్తున్నాడని బాధితుడైన పోడు రైతు ఏసీబీని ఆశ్రయించాడు.రైతు ఫిర్యాదుతో నిఘా పెట్టిన అధికారులు.. డబ్బులు తీసుకుంటున్న సమయంలోనే నరేష్‌ను పట్టుకున్నారు.మారుమూల గ్రామాల్లో అవినీతికి పాల్పడితే ఉపేక్షించేది లేదని ఈ సందర్భంగా డీఎస్పీ రమేష్ హెచ్చరించారు.ప్రస్తుతం అధికారిని అదుపులోకి తీసుకున్న ఏసీబీ బృందం కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది.


