Homeతెలంగాణనిజామాబాద్కార్మిక శ్రామిక వర్గానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లో 25% ఆర్థిక వాటా కేటాయించాలి.

కార్మిక శ్రామిక వర్గానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లో 25% ఆర్థిక వాటా కేటాయించాలి.

📰 Generate e-Paper Clip

కార్మిక శ్రామిక వర్గానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లో 25% ఆర్థిక వాటా కేటాయించాలి.

రాపెల్లి శ్రీనివాస్. అధ్యక్షులు. మజ్దూర్ జనతా పార్టీ.

హైదరాబాద్ సిటిబ్యూరో /మే 1( జనసంఘర్షణ )

140 వ మే__డే ఉత్సవాలను పురస్కరించుకొని నిజామాబాద్ నగరంలో కోట గల్లిలో మే డే వేడుకలను నిర్వహించారు.

మే డే ఉత్సవాలలో భాగంగా ముఖ్య అతిథులుగా గుజ్జ రాజేశ్వరి రిటైల్ బట్టలు గుమాస్తా సంఘం అధ్యక్షులు జాడే సంతోష్  భారతీయ సంవిధాన్ ప్రచారక్ దళ్ రాష్ట్ర నాయకులు బత్తుల రవి బీడీ టేకేదారుల రాష్ట్ర కార్యదర్శి రచ్చ ఆంజనేయులు గారు చరణ్ గారు ఇంకా ప్రముఖులు పాల్గొన్నారు.

మే డే సందర్భంగా రాపెల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ 140 వ మే డే శుభాకాంక్షలు తెలియజేశారు.

చికాగో నగరంలో అమరులైన కార్మికుల త్యాగఫలమే మే డే అని పేర్కొంటూ అనాటి నుండి సమాన పనికి సమాన వేతనం 8 గంటల పని వేళలు అమలు లోకి వచ్చాయని పేర్కొన్నారు. అయితే మళ్ళీ కార్మిక చట్టాల స్థానంలో 4 లేబర్ కోడ్లను కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టడం పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 4 లేబర్ కోడ్లను రద్దు చేసి తిరిగి 29 కార్మిక చట్టాలను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అలాగే కోటగల్లి గడ్డ నుండి బీడీ కార్మికుల జీవన భృతి కోసం అనేక ఉద్యమాలు చేసి ఎన్నికల్లో మేనిఫెస్టో లో పెట్టీ 4 లక్షల మంది కి బీడీ కార్మికుల కు జీవన భృతి సాధించడం జరిగింది అని పేర్కొన్నారు. స్థానిక ఎంపీ అరవింద్  ఎన్నికల ప్రచారంలో భాగంగా అమిత్ షా నిజామాబాద్ కు వచ్చినప్పుడు బీడీ కార్మికుల కోసం 500 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడతామని హామీ ఇచ్చి విస్మరించారని గుర్తు చేశారు. కార్మికుల సంక్షేమం కోసం బడ్జెట్ నుండి 25% ఆర్థిక వాటా కేటాయించాలని కోరారు. అమరులైన కార్మికుల త్యాగఫలమే మే డే అని పేర్కొన్నారు.

గుజ్జ రాజేశ్వరి మాట్లాడుతూ కార్మికులు న్యాయ సలహాల కోసం న్యాయ వ్యవస్థను ఉపయోగించుకోవాలని పేర్కొన్నారు. బత్తుల రవి మాట్లాడుతూ 4 లేబర్ కోడ్లను రద్దు చేసి తిరిగి 29 కార్మిక చట్టాలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జాడే సంతోష్ మాట్లాడుతూ కార్మికులు లేనిదే వ్యవస్త లేదని కార్మికుడు దేవుడు అని మే డే సందర్భంగా పేర్కొన్నారు.

రచ్చ ఆంజనేయులు మాట్లాడుతూ మే డే శుభాకాంక్షలు తెలిపి కార్మికులు ఐక్యంగా ఉండి సంక్షేమ పథకాలు సాధించుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మంగోల్ ఎల్లయ్య, నర్సయ్య, చరణ్, రాజ్ గణేష్, గజం శ్రీకాంత్,రాజేందర్ తదితరులు పాల్గొని మే డే ఉత్సవాన్ని విజయవంతం చేశారు.

మజ్దూర్ జనతా పార్టీ అధ్యక్షులు రాపెల్లి శ్రీనివాస్ గారు కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు.

కార్మికుల హక్కులను ఉపయోగించుకోవాలని గజ్జ రాజేశ్వరి న్యాయ సేవ సంస్థ యొక్క కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular