Homeతెలంగాణనిజామాబాద్వృక్షశాస్త్రంలో దాసరి రఘు కి డాక్టరేట్ డిగ్రీ ప్రదానం

వృక్షశాస్త్రంలో దాసరి రఘు కి డాక్టరేట్ డిగ్రీ ప్రదానం

📰 Generate e-Paper Clip

 

తెలంగాణ యూనివర్సిటీ, వృక్షశాస్త్ర విభాగంలో దాసరి రఘుకి మంగళవారం జరిగిన వైవా-వోస్ కార్యక్రమంలో డాక్టరేట్ డిగ్రీ ప్రదానం చేయడం జరిగింది. ఆచార్య బి. విద్యావర్థిని పర్యవేక్షణలో పరిశోధకుడు రఘు “ఎన్హాన్స్మెన్ట్ ఆఫ్ క్వాంటిటెటివ్, క్వాలిటీటివ్ యీల్డ్, వయాబిలిటీ అండ్ లో జర్మినేషన్ రేట్ ఇన్ క్లియోమ్ విస్కోసా అండ్ క్లియోమ్ గైనండ్రా బై అప్లికేషన్ అఫ్ బ్రాస్సినోస్టిరైడ్స్” అనే అంశం పై పరిశోధక గ్రంథాన్ని తెయు కు సమర్పించారు. దీనికి కేంద్రియ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ కి చెందిన ఆచార్య రాహుల్ కుమార్ ఎక్స్టెర్నల్ ఎగ్జామినర్ గా వ్యవహరించారు. కాగా రఘు తన పరిశోధన ఫలితాలను వివరించారు. రఘు పరిశోధన ఫలితాలపై సంతృప్తి చెంది డాక్టరేట్ అవార్డును ప్రకటించారు. ఈ కార్యక్రమంలో వృక్షశాస్త్ర విభాగాధిపతి డా. ఎ. ఎ. హలీమ్ ఖాన్, తెయు సైన్స్ డీన్ ఆచార్య సంపత్ కుమార్, చైర్పర్సన్, బివోఎస్ డా. ఎమ్. అరుణ, డా. దేవరాజు శ్రీనివాస్, డా. వి. జలంధర్, పరిశోధక విద్యార్థులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular