సత్తుపల్లి మున్సిపల్ ఆఫీస్లో ఏసీబీ ‘మెరుపు’ దాడి
రికార్డుల వేటలో అధికారులు!
అవినీతి తిమింగలాల గుండెల్లో ఏసీబీ అధికారులు రైళ్లు పరిగెత్తించారు. సత్తుపల్లి పురపాలక కార్యాలయం వేదికగా మంగళవారం ఒక్కసారిగా ఏసీబీ సోదాలు నిర్వహించడం స్థానికంగా పెను కలకలం రేపింది. అక్రమాలపై గురి
మున్సిపల్ పరిధిలో చేపట్టిన పలు అభివృద్ధి పనుల్లో భారీగా అక్రమాలు జరిగినట్లు ఏసీబీ అధికారులకు పక్కా సమాచారం అందింది. ఈ ఫిర్యాదుల ఆధారంగా రంగంలోకి దిగిన ఖమ్మం ఏసీబీ డీఎస్పీ రమేష్ గారి బృందం, కార్యాలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టింది. రికార్డుల పరిశీలన డీఎస్పీ రమేష్ గారి ఆధ్వర్యంలో అధికారులు ప్రతి రికార్డును జల్లెడ పట్టారు. ముఖ్యంగా నిధుల మళ్లింపు, పనుల నాణ్యతపై ఆరా తీశారు.
స్టేట్మెంట్ల నమోదు కార్యాలయంలోని పలువురు అధికారుల నుండి కీలక సమాచారాన్ని సేకరించడమే కాకుండా, వారి స్టేట్మెంట్లను కూడా రికార్డ్ చేసినట్లు డీఎస్పీ రమేష్ వెల్లడించారు.వణుకుతున్న అక్రమార్కులు
ఏసీబీ దాడులతో మున్సిపల్ అధికారులు, కాంట్రాక్టర్ల గుండెల్లో గుబులు మొదలైంది. తనిఖీల్లో ఎలాంటి నిజాలు బయటపడతాయో, ఎవరిపై వేటు పడుతుందోనన్న ఉత్కంఠ సత్తుపల్లిలో నెలకొంది.


