శ్రీరామ నవమి పండుగ నేపథ్యంలో శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని వైన్స్ షాపులు బంద్ పోలీస్ కమిషనర్ వెల్లడి నిజామాబాదు పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్ , ఆర్మూర్ , బోధన్ డివిజన్ పరిధిలో గల ప్రజలందరికీ తెలియజేయునది. సెక్షన్ 20(1) తెలంగాణ ఎక్సైజ్ యాక్ట్ 1968 ప్రకారంగా ఏమనగా శ్రీరామనవమి పండుగ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకొని ముందస్తు చర్యలలో భాగంగా జిల్లాలో గల కళ్ళు దుకాణాలు , కల్లు డిపోలు , ఐ.ఎమ్.ఎల్ (ఎ4) షాప్స్ / 2-బి బార్స్ / క్లబ్బులు / టిడి-1 మరియు సిఎస్ -2 మొదలగునవి తేదీ: 27-3-2026 ఉదయం 6 గంటల నుండి తేది : 28-3-2026 ఉదయం 6 గంటల వరకు మూసి వేయబడును.


