Homeతెలంగాణనిజామాబాద్జెండా జాతర ఉత్సవంలో పాల్గొన్న అర్బన్ ఎమ్ ఎల్ ఏ ధన్ పాల్ సూర్యనారాయణ గుప్త

జెండా జాతర ఉత్సవంలో పాల్గొన్న అర్బన్ ఎమ్ ఎల్ ఏ ధన్ పాల్ సూర్యనారాయణ గుప్త

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ / సెప్టెంబర్ 26 / ( జన సంఘర్షణ )

ఇందూరు: నగరంలోని జెండా బాలాజీ ఆలయంలో శనివారం నిర్వహించిన జెండా జాతరలో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…ఇందూరులో ఏళ్లుగా జెండా జాతర ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. భాద్రపద మాసంలో వినాయకచవితికి ముందు జెండా జాతర ప్రారంభం అవుతుందన్నారు. జెండా ఆలయం నుంచి శోభాయాత్రగా పులాంగ్ వరకు కొనసాగి, అక్కడ వారం రోజులపాటు ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరు దర్శించుకొని వేంకటేశ్వర స్వామి కృపా కటక్షాలు పొందాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ కార్పొరేటర్లు నాగోల్ల లక్ష్మీనారాయణ, పసునూరి రాము, మల్కాయి మహేందర్, ప్రసూన శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular