Homeతెలంగాణహైదరాబాద్కుత్బుల్లాపూర్‌లో గ్రేటర్ హైదరాబాద్ గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షులు సురేష్ గౌడ్‌కు ఘన సన్మానం

కుత్బుల్లాపూర్‌లో గ్రేటర్ హైదరాబాద్ గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షులు సురేష్ గౌడ్‌కు ఘన సన్మానం

📰 Generate e-Paper Clip

కుత్బుల్లాపూర్‌లో గ్రేటర్ హైదరాబాద్ గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షులు సురేష్ గౌడ్‌కు ఘన సన్మానం

 

–బహుజన వర్గాల ఐక్యతే లక్ష్యంగా భవిష్యత్తు కార్యాచరణ.

 

హైదరాబాద్ సిటీ ప్రతినిధి నాగుల అంజిబాబు, అక్టోబర్ 04, (జన సంఘర్షణ): కుత్బుల్లాపూర్ వేదికగా శనివారం మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం, సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు సురేష్ గౌడ్‌ను జిల్లా నాయకత్వం శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించింది.ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి ఏకగ్రీవంగా తీర్మానించారు. కేవలం గౌడ సామాజిక వర్గం వరకే పరిమితం కాకుండా, బీసీ యువతను ఏకం చేస్తూ, ఎస్సీ, ఎస్టీ, బీసీ తదితర బహుజన వర్గాలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా మరింత బలోపేతం అయ్యే విధంగా భవిష్యత్తు కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించారు. అణగారిన వర్గాలన్నీ ఒకతాటిపైకి వచ్చి, ఒకరికొకరు అండగా నిలుస్తూ హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడాలని నేతలు స్పష్టం చేశారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మహిళా అధ్యక్షురాలు జ్యోతి గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సాయి గౌడ్, ప్రముఖ నాయకులు యాకయ్య గౌడ్, నర్సింహా గౌడ్, వెంకటేష్ గౌడ్, కృష్ణవేణి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

 

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular