*25వ రజతోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు గ్రామం ఒక్కటై ముందడుగు
భక్తులకు పారిశుధ్యం, తాగునీరు, వీధి దీపాలు, చెత్తబండి వంటి సౌకర్యాలు కల్పించాలని వినతి
శతచండీ యాగం సందర్భంగా జీవహింస నిరోధానికి పంచాయతీ తీర్మానం చేయాలని విజ్ఞప్తి
*హిందూ బంధువులంతా ఏకమై ఉత్సవాలను విజయవంతం చేయాలి: శ్రీను..
కోటగిరి,/ అక్టోబర్ 4/(జన సంఘర్షణ): భక్తి, ఆధ్యాత్మికత, సేవాభావం, ఐక్యతకు ప్రతీకగా కోటగిరి గ్రామంలో 25వ రజతోత్సవ శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు గ్రామ ప్రజలు సిద్ధమవుతున్నారు. ఈ నెల 11వ తేదీ నుంచి 21వ తేదీ వరకు జరగనున్న ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లపై శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు ప్రత్యేక దృష్టి సారించారు.
*ఈ నేపథ్యంలో గ్రామ ప్రథమ పౌరుడు, సర్పంచ్ బర్ల మధుకర్కు వినతిపత్రం అందజేశారు.!!!!!* ఉత్సవాల సందర్భంగా శ్రీ విఠలేశ్వర మందిరానికి వేలాది మంది భక్తులు తరలిరానున్నందున, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు.
*భక్తుల సౌకర్యమే ప్రధాన లక్ష్యం….!!!!*
ఉత్సవాల సందర్భంగా ఆలయ పరిసరాల్లో ప్రతిరోజూ వేలాది మంది భక్తులకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించనున్న నేపథ్యంలో నిరంతర పారిశుధ్య నిర్వహణ, ప్రత్యేక చెత్తబండి ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
అదేవిధంగా భక్తుల దాహార్తిని తీర్చేందుకు ఆలయ పరిసరాల్లో నిరంతరం మంచినీటి సౌకర్యంతో వాటర్ ట్యాంకర్ అందుబాటులో ఉంచాలని కోరారు. ఆలయ పరిసరాలతో పాటు ప్రధాన రహదారుల్లో రాత్రివేళ భక్తులకు ఇబ్బందులు కలగకుండా వీధి దీపాలు సక్రమంగా వెలిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
*పవిత్రతకు ప్రతీకగా శతచండీ యాగం…..!!!*
ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 15వ తేదీ నుంచి 18వ తేదీ వరకు శ్రీ శతచండీ యాగం అత్యంత నిష్ఠతో, పవిత్ర వాతావరణంలో నిర్వహించనున్నారు. ఈ పవిత్ర కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఆ నాలుగు రోజుల పాటు గ్రామంలో మేకలు, పశువులు, కోళ్లను కోయకుండా, మాంసం విక్రయాలు జరగకుండా పంచాయతీ తీర్మానం చేయాలని కోరారు.
ఈ నిర్ణయాన్ని గ్రామ ప్రజలందరికీ దండోరా, ఇతర ప్రచార మార్గాల ద్వారా తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. గ్రామ ఆధ్యాత్మిక వాతావరణాన్ని కాపాడేందుకు అందరూ సహకరించాలని కోరారు.
*“25వ రజతోత్సవాలు చిరస్మరణీయంగా నిలవాలి”!
*ఈ సందర్భంగా శ్రీను మాట్లాడుతూ,…..* రాబోయే విజయదేవి ఉత్సవాలను విజయవంతం చేసేందుకు హిందూ బంధువులందరూ ఏకమై సహకరించాలని పిలుపునిచ్చారు.
*“25వ సంవత్సరం రజతోత్సవాలు….!!!* కావడం ప్రత్యేక సందర్భం. ఈ ఉత్సవాలను ఘనంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలి. కోటగిరి మండలం తరఫున హిందూ బంధువులందరూ ఏకమై ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరుతున్నాను” అని తెలిపారు.
*గ్రామ ఐక్యతకు నిదర్శనంగా ఉత్సవాలు….!!!!*
భక్తులకు సేవ చేయడం, ఆలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, తాగునీరు అందించడం, రాత్రివేళ తగిన వెలుతురు కల్పించడం వంటి అంశాలపై ముందుగానే దృష్టి సారించడం ద్వారా ఉత్సవాలను మరింత ఆదర్శంగా నిర్వహించవచ్చని కమిటీ సభ్యులు పేర్కొన్నారు.
గ్రామ సర్పంచ్ బర్ల మధుకర్కు వినతిపత్రం అందజేసిన ఉత్సవ కమిటీ సభ్యులు, 25వ రజతోత్సవాల్లో ఆయన కూడా ముందుండి పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆహ్వానించారు.
*భక్తి ఒక్కటే కాదు.. సేవా భావం,….!!!!* పరిశుభ్రత, క్రమశిక్షణ, ఐక్యతతో ఉత్సవాలను నిర్వహించాలనే సంకల్పం కోటగిరి గ్రామానికి ఆదర్శంగా నిలవాలని గ్రామ ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.


