“విద్యార్థుల విజయమే ఉపాధ్యాయుడికి అసలైన గుర్తింపు”.. సన్మాన కార్యక్రమంలో సూదం వెంకట్
నిజామాబాద్ జిల్లా ఉమ్మడి జిల్లాల బ్యూరో/అక్టోబర్ 6/(జన సంఘర్షణ)
పోతంగల్: నిజామాబాద్ జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికైన ZPHS పోతంగల్ పాఠశాల ఉపాధ్యాయుడు పి. నాగనాథ్‌కు పోతంగల్ గ్రామ సర్పంచ్, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయ బృందం ఘనంగా సన్మానం చేశారు.
జిల్లా కలెక్టర్, DEO అశోక్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా నాగనాథ్ ఎంపికైన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.
*ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు సూదం వెంకట్ మాట్లాడుతూ….!!!* ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ఒక్క ఉపాధ్యాయుడికి మాత్రమే దక్కిన గుర్తింపు కాదని, అది విద్యార్థుల కష్టానికి, వారి విజయానికి లభించిన గుర్తింపు అని అన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకుని, మంచి ర్యాంకులు సాధించి నలుగురిలో పేరు సంపాదించినప్పుడే ఉపాధ్యాయుడి కృషికి నిజమైన గుర్తింపు లభిస్తుందని పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు.
జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా నాగనాథ్ ఎంపిక కావడం పాఠశాలతో పాటు పోతంగల్ గ్రామానికి గర్వకారణమని పలువురు పేర్కొన్నారు. ఆయన మరింత మంది విద్యార్థులను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కల్లూరు సంధ్య హనుమాన్లు, MEO సాయిలు, మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమంత్, గ్రామ పెద్దలు పవన్ కుమార్, గంట్ల విట్టల్, కాశ గౌడ్, వార్డు సభ్యులు సంతోష్ పటేల్, పులకంటి సాయిలు, మన్సూర్, ధనరాజ్, సూదం శంకర్, గంగాధర్ పాల్గొన్నారు.
అలాగే ఉపాధ్యాయులు రామారావు, సూదం వెంకటేష్‌తో పాటు గ్రామ ప్రజలు భజరంగ్ హనుమండ్లు, సుదర్శన్, కేశ, శంకర్, పండరి తదితరులు పాల్గొని నాగనాథ్‌ను అభినందించారు.


