Homeబోధన్పంచాయతీ నిధుల దుర్వినియోగంపై ఆరోపణలు, కార్యదర్శిని నిర్బంధించి కార్యాలయానికి తాళం

పంచాయతీ నిధుల దుర్వినియోగంపై ఆరోపణలు, కార్యదర్శిని నిర్బంధించి కార్యాలయానికి తాళం

📰 Generate e-Paper Clip

 

కోటగిరి, అక్టోబర్ 13 (మన న్యూస్ తెలంగాణ):

నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలం హంగర్గ గ్రామ పంచాయతీలో నిధుల దుర్వినియోగంపై ఆరోపణలు వెల్లువెత్తాయి. పంచాయతీ కార్యదర్శి గంగారాం తీరును నిరసిస్తూ సర్పంచ్ నీరడి ఉదయ్ భాస్కర్, ఉపసర్పంచ్ డి.గోపాల్, పాలకవర్గ సభ్యులు, గ్రామస్థులు మంగళవారం కార్యాలయానికి తాళం వేసి ఆందోళన చేపట్టారు.

గ్రామసభలో ఖర్చుల వివరాలు వెల్లడించడం లేదని, సర్టిఫికెట్ల జారీకి రశీదులు లేకుండా డబ్బులు వసూలు చేస్తున్నారని, పన్నుల రూపంలో వసూలైన రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు బ్యాంకులో జమ చేయలేదని కార్యదర్శిపై ఆరోపణలు చేశారు.

విషయం తెలుసుకున్న మండల పంచాయతీ కార్యదర్శుల సంఘం ప్రతినిధులు గ్రామానికి చేరుకుని ప్రజాప్రతినిధులతో చర్చించారు. అనంతరం గ్రామ పంచాయతీ రికార్డులు, లావాదేవీల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

నిధుల దుర్వినియోగంపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు, పాలకవర్గ సభ్యులు ఉన్నతాధికారులను కోరారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular