Homeతెలంగాణనిజామాబాద్గత ప్రభుత్వ హాయంలో ఇందూర్ నగర అభివృద్ధి. కలెక్షన్, కరప్షన్, కమిషన్‌దే రాజ్యం: ఎమ్మెల్యే ధన్‌పాల్...

గత ప్రభుత్వ హాయంలో ఇందూర్ నగర అభివృద్ధి. కలెక్షన్, కరప్షన్, కమిషన్‌దే రాజ్యం: ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయ

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ సిటీ /  అక్టోబర్ 18 / ( జన సంఘర్షణ )

నిజామాబాద్ అర్బన్: గతంలో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గాన్ని పాలించిన మాజీ ఎమ్మెల్యే (బీఆర్‌ఎస్‌) పాలనపై ప్రస్తుత ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ ఘాటైన విమర్శలు చేశారు. గత పాలనను తలుచుకుంటే ‘ట్రిపుల్ సీ’ (CCC) గుర్తుకు వస్తుందని, కలెక్షన్, కరప్షన్, కమిషన్‌ విధానాలతో పాలన సాగిందని ఆయన ఆరోపించారు. గత పాలనకు, ప్రస్తుత అభివృద్ధికి మధ్య స్పష్టమైన వ్యత్యాసం ఉందని పేర్కొన్నారు.

తాను ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేసేందుకు కృషి చేస్తున్నామని ధన్‌పాల్ సూర్యనారాయణ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా అర్బన్ నియోజకవర్గ ప్రజలకు అనేక ప్రయోజనాలు చేకూరుతున్నాయని, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేందుకు ఈ పథకాలు దోహదపడుతున్నాయని పేర్కొన్నారు.

20 ఏళ్లుగా బీజేపీలో సేవలు

గత 20 ఏళ్లుగా తాను భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్నానని ఎమ్మెల్యే తెలిపారు. తమ నాయకుడు నరేంద్ర మోదీ మూడుసార్లు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారని గుర్తుచేశారు. ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం కలిగిన రాజకీయ పార్టీలలో బీజేపీ ఒకటిగా నిలిచిందని పేర్కొంటూ, పార్టీ సిద్ధాంతాలు, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలే తమకు మార్గదర్శకమని వివరించారు.

కేంద్ర పథకాలతోనే ఇందూరు అభివృద్ధి

ఇందూరు నగరానికి రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు ఆశించిన స్థాయిలో అందడం లేదని ధన్‌పాల్ సూర్యనారాయణ విమర్శించారు. నగరంలో అమలవుతున్న పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వ పథకాలతో ముడిపడి ఉన్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రజలకు మరిన్ని ప్రయోజనాలు అందించేందుకు కృషి చేస్తామని చెప్పారు.

రెండేళ్లలో నగర రూపురేఖలు మారుస్తాం

రానున్న రెండేళ్లలో ఎంపీ ధర్మపురి అరవింద్ నాయకత్వంలో ఇందూరు నగరాన్ని కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చేసి చూపిస్తామని ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ ధీమా వ్యక్తం చేశారు. నగర అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపడుతూ, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే తమ లక్ష్యమని వెల్లడించారు.

మీడియాను ఉద్దేశించి మాట్లాడిన ఆయన, కేంద్ర ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తూ నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు.

*ఖిల్లా రామాలయానికి రోప్ వే మంజూరు*

* తొందరలోనే డిపిఆర్ సిద్ధం

ఎంతో ఘన చరిత్ర కలిగిన ఇందూరు కిల్లా రామాలయానికి రూపే మంజూరు అయినట్లు అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ తెలిపారు జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం నాడు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చత్రపతి శివాజీ గురువు సమర్థ రామదాసు నిర్మించిన చరిత్ర ఆత్మకు కట్టడం ఖిల్లా రామాలయం అని అన్నారు

తెలంగాణ సాయుధ పోరాటంలో దాశరథి కృష్ణమాచార్యులు జైలు శిక్ష అనుభవిస్తూ *తెలంగాణ నా కోటి రతనాల వీణ* అని రాసిన గొప్ప చరిత్ర కలిగిన ఖిల్లా రామాలయానికి రూపే మంజూరు కావడం ఇందూరు నగర ప్రజలకు ఎంతో గర్వకారణం అని కొనియాడారు నెల్లూరు నగరాన్ని పర్యాటక స్థలంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని పేర్కొన్నారు సుమారు 35 కోట్ల నిధులతో రోపే నిర్మాణం కానని ఇందుకోసం డిపిఆర్ సిద్ధం చేస్తున్నారని పేర్కొన్నారు! ఇందులో భాగంగానే పర్వతామాల పథకానికి శ్రీకారం చుట్టారని ఆయన గుర్తు చేశారు కేంద్రమంత్రి నితిన్ ఘట్కరితో పాటు రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి జిల్లా రామాలయ అభివృద్ధిపై అనేకసార్లు లేఖలు అందజేయడం జరిగిందన్నారు ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రోడ్ల భవనాల శాఖ అధికారులను ప్రతినిధులను పంపడం సంతోషకరమన్నారు గత ప్రభుత్వ హాయంలో నిలిచిపోయిన పనులపై కూడా అనేకసార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినట్లు గుర్తు చేశారు రాష్ట్రంలో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఒకటి కూడా రాని నియోజకవర్గము ఉందంటే అది ఒక ఇందూరైనని తెలియజేశారు ఇట్టి సమస్యను మంత్రి పొంగులేటి దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు దీంతో ఇటీవల అర్బన్ లోని సౌత్ మండల అర్హులకు ఇల్లు కేటాయించాలని గుర్తు చేశారు అలాగే స్థలం లేని వారికి హైదరాబాద్ మాదిరిగా టవర్లు నిర్మించి ఇవ్వాలని చెప్పినట్లు తెలియజేశారు

*ప్రధానంగా స్పెషల్ ఫండ్ కోసం ప్రభుత్వానికిలేఖ*

పలుమార్లు ప్రభుత్వానికి లేఖ రాసినప్పటికీ చివరికి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి దృష్టికి, తీసుకెళ్లిన లాభం లేకుండా పోయిందన్నారు. స్పెషల్ పండు కేటాయిస్తే నియోజకవర్గ అభివృద్ధి సులువుగా అవుతుందని ఆయన తెలిపారు! కాషాయ జెండా గెలుపును ఓర్చుకోలేక నిధులు విడుదల చేయడం లేదని విమర్శించారు! అనవసరపు మాటలు మాట్లాడడమే తప్ప అభివృద్ధి కొరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించడం లేదన్నారు. ఇట్టి సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నాగోల లక్ష్మీనారాయణ, కార్పొరేటర్లు ఎర్రం సుధీర్, జగదీష్ కులకర్ణి, మఠం పవన్, రాము, మల్లేష్ యాదవ్, ప్రసూన శ్రీనివాస్ రెడ్డి, జ్యోతి మురళి, బంటు ప్రీతి ప్రవీణ్, మహిళా మోర్చా అధ్యక్షురాలు వనిత, యువర్ మోర్చా అధ్యక్షులు వంశీ, దోమూర్చ రాష్ట్ర సహా కోశాధికారి విజయ్, ఎస్సీ మోర్చా పురుషోత్తం, వీరేందర్ తదితరులు పాల్గొన్నారు!

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular