Homeతెలంగాణఖమ్మంశ్రీ ధారావత్ శంకర్ గారి వైద్య చికిత్సకు ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) ద్వారా ₹2,50,000/- ఆర్థిక...

శ్రీ ధారావత్ శంకర్ గారి వైద్య చికిత్సకు ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) ద్వారా ₹2,50,000/- ఆర్థిక సహాయం మంజూరు కావడం ఎంతో సంతోషకరమైన విషయం.

📰 Generate e-Paper Clip

సింగరేణి ప్రతినిధి: (జన సంఘర్షణ) న్యూస్

ఆపదలో ఉన్న ఒక కుటుంబానికి అవసరమైన సమయంలో అండగా నిలవడం మనందరి బాధ్యత. ఈ విషయంలో గౌరవ ఖమ్మం పార్లమెంట్ సభ్యులు శ్రీ రామసహాయం రఘురామ రెడ్డి గారు, గౌరవ వైరా శాసనసభ్యులు శ్రీ మాలోత్ రాందాస్ నాయక్ గారు చూపిన ప్రత్యేక చొరవకు హృదయపూర్వక ధన్యవాదాలు

శంకర్ గారి వైద్య సహాయం కోసం సంబంధిత ప్రజాప్రతినిధులు మరియు అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లే అవకాశం నాకు కలగడం నా బాధ్యతగా భావిస్తున్నాను. ప్రజలకు అవసరమైన సమయంలో వారికి అండగా నిలిచి, ప్రభుత్వ సంక్షేమ పథకాలు మరియు సహాయాన్ని అందేలా చేయడమే నా లక్ష్యం.

శంకర్ గారు త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుని తన కుటుంబంతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

“ప్రజలకు అవసరమైన సమయంలో అండగా నిలవడమే నిజమైన ప్రజాసేవ.

ప్రజల కష్టాల్లో భాగస్వాములై, వారికి తోడుగా ఉండటం నా బాధ్యత.”

ఇట్లు,

శ్రీమతి హేమలత బాలాజీ

గౌరవ సర్పంచ్, పొలం పల్లి గ్రామ పంచాయతీ

ఖమ్మం జిల్లా DISHA కమిటీ సభ్యురాలు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular